OG Comic Book : పవన్ కళ్యాణ్ OG కామిక్ బుక్ వచ్చేసింది.. ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..

OG రిలీజ్ కి ముందే దీనికి సంబంధించిన ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. (OG Comic Book)

OG Comic Book : పవన్ కళ్యాణ్ OG కామిక్ బుక్ వచ్చేసింది.. ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..

OG Comic Book

Updated On : September 28, 2025 / 3:42 PM IST

OG Comic Book : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాకు ఎంత హైప్ వచ్చిందో అందరికి తెలిసిందే. దానికి తగ్గట్టే ఇప్పటికే ఈ సినిమా పెద్ద హిట్ అయి ఆల్మోస్ట్ 200 కోట్ల గ్రాస్ దాటేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ చాలా ప్లాన్స్ ఉన్నట్టు, ఈ సినిమాకు జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా పెద్ద కథ ఉన్నట్టు, సుభాష్ చంద్రబోస్ కి లింక్ ఉన్నట్టు.. డైరెక్టర్ సుజీత్ పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.(OG Comic Book)

OG రిలీజ్ కి ముందే దీనికి సంబంధించిన ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ కామిక్ బుక్ లో పవన్ కళ్యాణ్ జపాన్ లో చేసే యాక్షన్స్ కి సంబంధించిన కథ ఉంటుందని సమాచారం. దీంతో కామిక్ బుక్స్ లవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG కామిక్ బుక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసారు. తాజాగా ఈ కామిక్ బుక్ రిలీజ్ అయినట్టు, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొమ్మని దీనికి సంబంధించిన ఓ పవర్ ఫుల్ కామిక్ వీడియోని రిలీజ్ చేసారు నిర్మాణ సంస్థ.

Also See : CM Chandrababu Naidu : జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ జపాన్ యోధుడిగా ఫైట్స్ చేసినట్టు చూపించారు. చివర్లో సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నట్టు చూపించారు. ఈ కామిక్ బుక్ కథ, డిజైన్, డైరెక్షన్ అంతా సుజీత్ చేసాడు. అయితే దీన్ని బుక్ రూపంలో సినీ విజ్ అనే కంపెనీ మార్చింది. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు https://cineviz.co.in/store ఈ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు.

OG కామిక్ బుక్ మాములు పేపర్ బుక్ అయితే 360 రూపాయలు, హార్డ్ పేపర్ తో చేసిన బుక్ అయితే 600 రూపాయలు ధర ఉన్నట్టు ప్రకటించారు. ఇది ఆ వెబ్ సైట్ లో ఆర్డర్ చేసుకుంటే అక్టోబర్ 2 తర్వాత డెలివరీ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం కామిక్ బుక్స్ లవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG కామిక్ బుక్ ని ఆర్డర్ చేసేసుకోండి.

Also Read : Chiranjeevi : చరణ్ బాబు అంటూ.. కొడుకుపై గర్వంతో నాన్నగా మెగాస్టార్ స్పెషల్ పోస్ట్..