Ramesh Babu : మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి

హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న రమేష్ బాబు శనివారం కన్నుమూశారు

Mahesh Babu Brother

Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం సాయంత్రం 9 గంటల సమయంలో మృతి చెందారు. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు.

మనుషులు చేసిన దొంగలు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు. సామ్రాట్‌ మూవీతో హీరోగా పరిచమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తెలుగుతోపాటు హిందీ సినిమాలను కూడా నిర్మించారు రమేష్ బాబు.సూర్యవంశం (హిందీ), అర్జున్‌, అతిథి, దూకుడు చిత్రాల ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవరించారు. రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది . అయితే మరోపక్క మహేష్ కరోనాతో పోరాడుతుండగా.. ఆయన రమేష్ బాబును చూడడానికి వస్తారా.. రారా అన్నది తెలియాల్సి ఉంది.