Thalaivar 171 : ‘లియో’ తర్వాత లోకేశ్ రజినీకాంత్ తోనే? తలైవర్ 171వ సినిమా కొత్త సంవత్సరంలో మొదలు..
తాజాగా రజినీకాంత్ 171వ సినిమాపై అప్డేట్ వచ్చేసింది. తలైవా 171వ సినిమా తమిళ్ యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలిసిందే.
- Saketh U
- Published On : July 19, 2023 / 08:44 AM IST
Super star Rajinikanth 171 Movie update under Lokesh Kanagaraj Direction
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్(Jailer) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ తన 170వ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.
తాజాగా రజినీకాంత్ 171వ సినిమాపై అప్డేట్ వచ్చేసింది. తలైవా 171వ సినిమా తమిళ్ యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలిసిందే. ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో షూటింగ్ కి వెళ్లనుంది. ఈ లోపు రజిని తన 170వ సినిమా షూట్ పూర్తి చేయనున్నారు. ఇక లోకేశ్ ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లియో సినిమా ఈ సంవత్సరం దసరాకి రిలీజ్ కానుంది.
లియో తర్వాత లోకేశ్ రజినీకాంత్ సినిమాపై వర్క్ చేయనున్నాడు. ఇది కూడా తన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండబోతుందని సమాచారం. రజిని సినిమా లైన్ లోకి రావడంతో ఖైదీ 2, విక్రమ్ సీక్వెల్ వాయిదా పడతాయని సమాచారం. చాన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు లోకేశ్. దీంతో లోకేశ్ – సూపర్ స్టార్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
