Rajinikanth: సూపర్ స్టార్ ప్రశంసలే నాకు వరం.. రజనీకాంత్ పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగం.

ధురంధర్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఎమోషనల్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.

Super star Rajinikanth Praises Dhurandhar movie

Rajinikanth: బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్ 2’ సినిమాపై ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో, రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ‘బాక్సాఫీస్ కా బాప్’ అని అభివర్ణిస్తూ, ఈ సినిమా ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన అద్భుత చిత్రమని కీర్తించారు. రజనీకాంత్(Rajinikanth) వంటి సూపర్ స్టార్ ఈ సినిమాను ఇంతగా ప్రశంసించడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Kavya Kalyanram-Kaala Bhairava: కాలభైరవ, కావ్య పెళ్లి వార్తలు.. జంటగా కనిపించి హింట్ ఇచ్చారుగా.. వైరల్ అవుతున్న వీడియో

తలైవా చేసిన ఈ పోస్ట్‌కు దర్శకుడు ఆదిత్య ధర్ చాలా ఎమోషనల్‌ అయ్యారు. తామంతా రజనీకాంత్‌ను ఒక బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగామని, వినోదానికి ఆయనే అసలైన నిర్వచనమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే స్టైల్, గ్రేస్‌తో మ్యాజిక్ చేస్తున్న రజనీకాంత్ లాంటి స్టార్ నుంచి ప్రశంసలు అందుకోవడం తన జీవితంలోనే అతిపెద్ద ‘సూపర్‌స్టార్’ మూమెంట్ అని ఆదిత్య అభివర్ణించారు. తమను పెద్ద కలలు కనేలా ప్రోత్సహించిన వ్యక్తి నుంచి అందిన ఈ అభినందనలు ఒక వరంలా ఉన్నాయని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం ధురంధర్ 2పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ధురందర్ 2’ సినిమాపై సూపర్ స్టార్ కామెంట్స్ చేయడంతో, ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.