Kavya Kalyanram-Kaala Bhairava: కాలభైరవ, కావ్య పెళ్లి వార్తలు.. జంటగా కనిపించి హింట్ ఇచ్చారుగా.. వైరల్ అవుతున్న వీడియో
పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న సమయాన కలిసి కనిపించిన కావ్య కళ్యాణ్‌రామ్- కాల భైరవ(Kavya Kalyanram-Kaala Bhairava).
Kavya Kalyanram and Kaala Bhairava Spotted Together Amidst Viral Wedding Rumors
Kavya Kalyanram-Kaala Bhairava: టాలీవుడ్లో వరుస పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వంటి స్టార్ హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెట్టగా, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన భాగస్వామిని ఇటీవలే పరిచయం చేశారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో జంట యాడ్ కానుంది. ఆ జంట మరెవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ కాలభైరవ, బలగం సినిమాతో మెప్పించిన హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్(Kavya Kalyanram-Kaala Bhairava).
ఈ జంట గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి పరిచయం ‘ఉస్తాద్’ సినిమా షూటింగ్ సమయంలో మొదలైనట్లు తెలుస్తోంది. కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య హీరోయిన్గా నటించింది. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారిందని, దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
ఈ నేపధ్యంలోనే, తాజాగా వీరిద్దరూ ఒకే వేడుకలో జంటగా కనిపించడంతో, తమ బంధంపై నెటిజన్లకు హింట్ ఇచ్చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు కలిసి ఉన్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. దీంతో, ఈ జంట పెళ్లిపై వస్తున్న వార్తలకు బలం చేకూరింది. మరి, ఈ పెళ్లిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక కావ్య కల్యాణ్‌రామ్ ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించి, మసూద, బలగం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇక కాలభైరవ విషయానికి వస్తే, మత్తు వదలరా చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై.. కార్తికేయ 2, మత్తు వదలరా 2 వంటి హిట్ సినిమాలకు పనిచేశారు. నాటు నాటు పాటతో ఆస్కార్ వేదికపై మెరిసిన ఆయన, కొమురం భీముడో పాటకు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.
