Pawan Kalyan : ఆయన నా రక్తంలోకి ఎక్కేశారు.. 21 కి 21 వస్తాయని ముందే చెప్పాను.. పవన్ ని కలిస్తే.. సుప్రీత కామెంట్స్ వైరల్..

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Pawan Kalyan)

  • Published on- October 5, 2026 / 09:44 AM IST

Pawan Kalyan

Pawan Kalyan : సురేఖవాణి కూతురుగా పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. సుప్రీత పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. గతంలో జనసేన గెలిచినప్పుడు కూడా సంబరాలు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Supritha : పెళ్లి సంబంధాలు చూడమన్నాను.. నాకెలాంటి అబ్బాయి కావాలంటే.. పెళ్లిపై సుప్రీత కామెంట్స్ వైరల్..

సుప్రీత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని పాలిటిక్స్ లో అందరూ తిట్టేవాళ్ళు మొదట్లో. ఆయన అంత మంచివాడైనా ఆయన్ని విమర్శిస్తుంటే బాధపడ్డాను. లాస్ట్ టైం ఎన్నికల్లో 21 కి 21 వస్తాయి అని నేను ముందే చెప్పాను. మా అమ్మ 19 వస్తాయి అంది. నేను చెప్పినట్టే 21 కి 21 వచ్చాయి. ముందే జనసేన టీ షర్ట్ కొనుక్కొని పెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఆ రోజు సాయంత్రం క్రాకర్స్ పేల్చాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే రోజు.

మా అమ్మ పంజాలో పవన్ కళ్యాణ్ గారికి అమ్మ క్యారెక్టర్ చేసింది. ఆయనని నేను ఇంకా కలవలేదు. ఒకవేళ కలిస్తే మొదట కాళ్ళు పట్టుకుంటాను. ఆయనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకొని, ఆయన చేసిన మంచి పనులు విని, ఆయన క్రేజ్ చూసి మొత్తం నా రక్తంలోకి ఎక్కేసింది పవన్ కళ్యాణ్ అంటే అని పవన్ పై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది.