Suriya – Karthi: ఆ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య.. హెల్ప్ చేసిన కార్తీ..
Suriya - Karthi Memories: తాజాగా వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. (Suriya)
- Saketh U
- Updated on- May 12, 2026 / 04:56 PM IST
Suriya And Karthi Theft From Nuthan Prasad House Shares Interesting Childhood
Suriya – Karthi: సూర్య, కార్తీ.. అన్నదమ్ములిద్దరూ హీరోలుగా దూసుకుపోతున్నారు. తమిళ్ లో ఎంత మార్కెట్ ఉందో ఈ ఇద్దరికీ తెలుగులో కూడా అంతే మార్కెట్ ఉంది. ఇద్దరి సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. సూర్య నటించిన కరుప్పు సినిమా మే 14న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి సూర్య రాగా కార్తీ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ చిన్నప్పుడు చేసిన ఓ అల్లరి పని గురించి తెలిపాడు సూర్య.
Also See : Suriya : వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్.. కత్తి పట్టిన సూర్య.. ఒకే వేదికపై అన్నదమ్ములు..
సూర్య మాట్లాడుతూ.. చిన్నప్పుడు మేము నూతన ప్రసాద్ గారి ఇంటి పక్కనే ఉండే వాళ్ళం. ఆయన ఇంట్లో మామిడికాయ చెట్టు ఉండేది. మా ఇంట్లో సన్ షైడ్ ఎక్కి వాళ్ళ ఇంట్లోకి దూకి మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. నేను పైకి ఎక్కి వాళ్ళ ఇంట్లోకి దూకడానికి కార్తీ హెల్ప్ చేసేవాడు. మామిడికాయలు తెచ్చాక ఇద్దరం వాటి కోసం కొట్టుకునేవాళ్ళం అని అప్పటి సరదా సంగతులను పంచుకున్నాడు.
