Karuppu: ఒక్క డైలాగ్ తో ఇళయరాజాకు అవమానం.. బేషరతుగా క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీం

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన కరుప్పు మూవీ టీం(Karuppu).

Suriya Karuppu Movie Team Apologizes to Ilaiyaraaja

  • ఇళయరాజాపై ‘కరుప్పు’ సినిమాలో సెటైర్లు.
  • ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.
  • మేకర్స్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

Karuppu: తమిళ స్టార్ సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అంతా బాగుంది అనుకునే సమయంలో సరికొత్త వివాదంలో చిక్కుకుంది ఈ సినిమా. కరుప్పు సినిమా ద్వితీయార్థంలో ఇళయరాజాను ఉద్దేశించి సాంగ్ కాపీరైట్స్‌ అంశంపై కొన్ని సెటైరిక్ డైలాగ్స్ పెట్టడం వివాదానికి దారితీసింది. తన అనుమతి లేకుండా పాటలు వాడుకుంటే కోర్టుకెళ్లే ఇళయరాజా నైజాన్ని ఇందులో తప్పుబడుతూ చూపించారని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Twisha Sharma: నటి త్విషా శర్మ అనుమానాస్పద మృతి.. పెళ్లయిన ఐదు నెలలకే విషాదం.. పరారీలో భర్త

సోషల్ మీడియాలో అభిమానుల నుండి వ్యతిరేకత పెరగడంతో ‘కరుప్పు(Karuppu)’ చిత్ర యూనిట్ తక్షణమే అప్రమత్తమైంది. సంగీత జ్ఞాని ఇళయరాజాకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం వినోదం కోసమే ఆ సంభాషణలు రాశామని, ఎవరినీ కించపరచడం లేదా తక్కువ చేసి చూపించడం తమ ఉద్దేశం కాదని నిర్మాతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వివాదాస్పదంగా మారిన ఆ దృశ్యాలను, డైలాగ్స్‌ను సినిమా నుండి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను శాంతింపజేశారు.

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా స్థానం అద్వితీయమైనదని, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని మేకర్స్ కొనియాడారు. చలనచిత్ర సంగీతానికి ఆయన అందించిన సహకారాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, సదరు డైలాగ్‌లను తొలగించడంతో ఇళయరాజా అభిమానులు కాస్త శాంతించారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై, మేకర్స్ క్షమాపణలపై రాబోయే రోజుల్లో మాస్ట్రో ఇళయరాజా స్వయంగా ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.