Vishwanath and Sons OTT : ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీ.. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ (Vishwanath and Sons OTT) స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.
- Thota Vamshi Kumar
- Published on- September 8, 2026 / 12:49 PM IST
Suriya Vishwanath and Sons OTT streaming date fix
Vishwanath and Sons OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్టు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. 250 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది. సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలియజేసింది.
MM Srilekha : జీన్స్‌లో సింగర్.. ఎంఎం శ్రీలేఖ క్యూట్ ఫోటోలు వైరల్..
Watch Vishwanath & Sons on Netflix, out 11 September in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam.
Explore Vishwanath & Sons, along with all your other favourite South Indian films and shows by searching for “Southverse” on Netflix.
— Netflix India South (@Netflix_INSouth) September 8, 2026
