Vishwanath and Sons Twitter Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
Vishwanath and Sons Twitter Review: సూర్య నటించిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 14, 2026 / 10:32 AM IST
Suriya Vishwanath and Sons twitter review
Vishwanath and Sons Twitter Review: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మమితా బైజు కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నేడు (ఆగస్టు 14న) తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య అదరగొట్టాడని చెబుతున్నారు. ఆయన సెటిల్డ్ అండ్ సాలిడ్ పెర్ఫార్మన్స్ మూవీని మరో లెవల్ కు తీసుకు వెళ్ళిందట. సూర్య, మమిత జంట చేసే సందడి, వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు.
Read Also – Prabhas : మరోసారి రాముడిలా ప్రభాస్..?
