Mahesh Babu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ..
కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : August 15, 2024 / 11:30 AM IST
Surper star Mahesh Babu Family members visited tirumala
Mahesh Babu : కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకున్నారు. మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితారలు గురువారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. బుధవారం అలిపిరి నడకమార్గాన వీరు తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.
Ravi Teja fans : హరీష్ శంకర్‌ను కొడతామంటున్న రవితేజ ఫ్యాన్స్..! వైరల్ అవుతున్న వీడియో..
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కుటుంబం. #MaheshBabu #Tirumala pic.twitter.com/p8jDI1uNL9
— Anitha Reddy (@Anithareddyatp) August 15, 2024
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్న సంగతి తెలిసిందే. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథను అందించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.
Mr Bachchan : మాస్ మహారాజ సినిమాలో యూత్ యువరాజ.. ఓ హీరో, ఓ మ్యూజిక్ డైరెక్టర్ గెస్ట్ అప్పీరెన్స్..
