Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో అద్భుతం.. హనుమంతుడికి సూర్య తిలకం.. అచ్చం అయోధ్య రామయ్య లాగే!

హనుమాన్ జయంతి రోజున అద్భుతమైన వీడియో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).

surya thilakam at megastar chiranjeevi home

  • మెగాస్టార్ నివాసంలో ఆధ్యాత్మిక వింత
  • హనుమంతుడి విగ్రహంపై సూర్యకిరణాల అద్భుతం
  • పూర్వజన్మ సుకృతం అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడంటే ఎంత అపారమైన భక్తి అనేది అందరికీ తెలిసిందే. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా తన ఇంట్లో పూజా మందిరంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక వింతను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు సూర్య కిరణాలు సప్తవర్ణాలుగా మారి, తన ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకు తాకుతూ వెళ్లడం ఒక అద్భుతమని ఆయన పేర్కొన్నారు(Chiranjeevi).

Kirrak Seetha: స్టైల్ అదిరింది.. అందం మెరిసింది.. కిర్రాక్ సీత హాట్ పోజులు నెక్స్ట్ లెవల్

అయోధ్యలోని బాలరాముడికి జరిగిన ‘సూర్య తిలకం’ వేడుకను ఈ దృశ్యం గుర్తు చేస్తోందని, అరసవిల్లి, కోణార్క్ వంటి క్షేత్రాల్లో జరిగే ఈ అద్భుతం తన ఇంట్లోనూ జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరు ఎమోషనల్ అయ్యారు. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం చైత్ర పూర్ణిమ నాడు (ఏప్రిల్ 2) జరుపుకునే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ విశేషమైన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తన విజయాల వెనుక ఆ వాయుపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయని నమ్మే చిరంజీవి, ఈ దైవానుభూతిని చూసి పరవశించిపోయారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు, భక్తులందరికీ ఆయన హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.