సుశాంత్ ‘స్ప్రైట్’ యాడ్ చూశారా!

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్.. ఫస్ట్ యాడ్ విడుదల..

  • Publish Date - February 27, 2020 / 10:18 AM IST

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్.. ఫస్ట్ యాడ్ విడుదల..

హీరోగా ‘చి.ల.సౌ’ సినిమాతో సక్సెస్ సాధించిన సుశాంత్, దాని తర్వాత కీలక పాత్ర పోషించిన ‘అల.. వైకుంఠపురములో’ వరుస హిట్లతో మాంచి జోరు మీదున్నాడు. తాజాగా ఆయన శీతల పానీయం ‘Sprite’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. సుశాంత్ ఇప్పుడు ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసిడర్. ఆ బ్రాండ్‌కు ఆయన చేసిన మొదటి కమర్షియల్ యాడ్ తాజాగా విడుదలైంది.

ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్‌లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్‌‌లో కనిపిస్తున్నాడు. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

కింగ్ నాగార్జున, నాగ చైతన్య, సమంత, అఖిల్ తర్వాత యాడ్‌లో నటించిన అక్కినేని కుటుంబ సభ్యుడు సుశాంత్ కావడం విశేషం. సుశాంత్ ప్రస్తుతం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.

Read More>>విడాకుల బాటలో బాలీవుడ్ జంట..