OG 2 : త్వరలో సెట్స్ పైకి ఓజీ-2?
ఓజీ-2 (OG 2) పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌లో రాబోతోందన్న టాక్ వినిపిస్తుంది.
Gossip Garage OG 2 will soon go on the sets
OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ అన్నింటికి ఫైనల్ టచ్ ఇస్తున్నాడట డైరెక్టర్ హరీశ్‌శంకర్. అయితే త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఇప్పటికే సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ మరో కొత్త సినిమా కమిట్ అయ్యారు. అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా పవన్ మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అదే ఓజీ-2 అంటున్నారు. అయితే ఈ సీక్వెల్‌కు నిర్మాత మారే ఛాన్స్ ఉందట. ఓజీ-2 (OG 2) పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌లో రాబోతోందన్న టాక్ వినిపిస్తుంది.
Trivikram : త్రివిక్రమ్ తో పోటీకి వచ్చిన దర్శకుడు.. సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా అనౌన్స్..
పవన్ కమిట్ మెంట్స్‌లో పీపుల్స్ మీడియాతో ఒక సినిమా, KVN ప్రొడక్షన్స్‌కి మరో సినిమా చేయాలి. అందుకే ఓజీ-2 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంపౌండ్ నుంచి రాబోతోందట. ఇక డైరెక్టర్ సుజిత్ కూడా ఓజీ-2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే OG2తో OG3కి లింక్ ఉంటుందనే టాక్ నడుస్తుంది. అంటే ఓజీ మరో రెండు పార్టులుగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఓజీ-3 కూడా పవనే చేస్తాడా ? లేకపోతే అకిరానందన్‌ను పరిచయం చేస్తారా అనేది వేచి చూడాలి.
