Darshini Trailer : ‘దర్శిని’ ట్రైలర్ చూశారా? భవిష్యత్తుని ముందే చూడగలిగితే..

తాజాగా దర్శిని సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు

Darshini Trailer : వికాస్, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా దర్శిని. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నిర్మాత KL దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా అయి ట్రైలర్ ని విడుదల చేశారు.

భవిష్యత్తు ఏం జరుగుతుందో ముందే చూడగలిగే టెక్నాలజీ కనిపెట్టి దాని వాళ్ళ ఎదురైనా ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. మీరు కూడా ఈ దర్శిని ట్రైలర్ చూసేయండి.

ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ టీం నన్ను కలిశారు. ప్రొఫెసర్స్ గా చేస్తూ డాక్టరేట్స్ సాధించి సినిమా మీద ప్యాషన్ తో వచ్చి తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీశారు అని తెలిపారు.

నిర్మాత డాక్టర్ LV సూర్యం మాట్లాడుతూ.. మాకు ఈ సినిమా ఫీల్డ్ కొత్త, కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఈ దర్శిని సినిమాని తీశాం. మాకు నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమాలో జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ఓ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది కామెడీ, ఎమోషన్, లవ్, సస్పెన్స్ లో చూపించాము. ఈ మే నెలలోనే సినిమాని రిలీజ్ చేస్తాము. త్వరలోనే డేట్ కూడా ప్రకటిస్తాం అని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు