ఫాంటసీ థ్రిల్లర్, సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.
పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, జయప్రద మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న ఫాంటసీ థ్రిల్లర్, సువర్ణ సుందరి.. ఎమ్.వి.కె.రెడ్డి సమర్పణలో, ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై, ఎమ్.ఎల్. లక్ష్మీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఎమ్ఎస్ఎన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. హిస్టరీ ఆల్వేస్ హంట్స్ ఫ్యూచర్ అంటూ, పునర్జన్మలో జరిగిన విపత్కర పరిస్థితులను, ప్రస్తుత జన్మలో ఎదుర్కొంటే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.
దాదాపు 1509 నాటి కాలంలో, కాలఖల్ రాజసంస్థానం నేపథ్యంలో సువర్ణ సుందరి తెరకెక్కనుందని తెలుస్తుంది. పూర్ణ, సాక్షి గెటప్, నటన పరంగా ఆకట్టుకున్నారు. సీనియర్ నటి జయప్రద, సాయికుమార్, కోట ఇంపార్టెంట్ రోల్స్ చేసారు. విజువల్స్, సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అవినాష్, జై జగదీష్, ముక్తర్ ఖాన్ తదితరులు నటిస్తున్న సువర్ణ సుందరి త్వరలో రిలీజ్ కానుంది.
వాచ్ ట్రైలర్…