Shyam Singha Roy : గత రెండు సినిమాల నుంచి నాని ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో రాబోయే సినిమాలను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్నాడు. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.
Skylab : స్కైలాబ్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ తో రాబోతున్న సత్యదేవ్
ముందే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.‘శ్యామ్ సింగరాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’ అంటూ పవర్ ఫుల్ గా సాగింది ఈ సాంగ్. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నాని పవర్ ఫుల్ లీడర్ గా కనపడనున్నాడు. నాని మాస్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సారి న్యాచురల్ స్టార్ నాని కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.