Skylab : స్కైలాబ్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ తో రాబోతున్న సత్యదేవ్

స్కైలాబ్.. దీని గురించి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలీదు. కానీ మన అమ్మ,నాన్న మన అమ్మమ్మ, తాతయ్య లని అడిగితే దీని గురించి కథలు కథలుగా చెప్తారు. 1979లో ప్రపంచాన్ని మొత్తం కంగారు

Skylab : స్కైలాబ్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ తో రాబోతున్న సత్యదేవ్

Skylab

Skylab :  స్కైలాబ్.. దీని గురించి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలీదు. కానీ మన అమ్మ,నాన్న మన అమ్మమ్మ, తాతయ్య లని అడిగితే దీని గురించి కథలు కథలుగా చెప్తారు. 1979లో ప్రపంచాన్ని మొత్తం కంగారు పెట్టిన ఏకైక సంఘటన స్కైలాబ్. అమెరికా ప్రవేశపెట్టిన ఓ ఉపగ్రహం పేరు స్కైలాబ్. ఇది ఫెయిల్ అవ్వడంతో భూమి మీదకి దూసుకు వచ్చింది. దీంతో భూమిపై ఎక్కడ పడుతుందో, ఎవరు చనిపోతారో అంటూ వార్తలు అప్పట్లో సంచలనంగా నిలిచాయి. దీనికి భయపడి ఇక మనం బతికుండం అని అప్పటి ప్రజలు చేసిన పనులు ఎన్నో. కానీ చివరికి ఆ స్కైలాబ్ ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి రియల్ కథకి కామెడీ జోడించి అద్భుతమైన సినిమాగా తీసుకురాబోతున్నారు. సత్యదేవ్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా స్కైలాబ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాని డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Jai Bheem : ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్రలో ఒదిగిపోయిన నటి ఎవరో తెలుసా?

ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ఆ రోజుల్లోనే పేపర్స్ కి వార్తలు పంపే విలేకరిగా హీరోయిన్, క్లినిక్ పెట్టాలని హీరో, మధ్యలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. ఇలా ఒక ఊళ్ళో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న సమయంలో స్కైలాబ్ భూమి మీద పడబోతుందని, ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలీదు అని, మనం అంతా చనిపోవచ్చు అని వార్తలు రావడంతో ఆ ప్రజలు ఏం చేశారు? కొంతమంది భయంతో, కొంతమంది మళ్ళీ బతకం కదా అని ఇలా ఎన్నో పనులు చేస్తారు. ఆ పనులని చాలా కామెడీగా చూపించినట్టు తెలుస్తుంది. అక్కడక్కడా ఆ భయంతో బాధాకరమైన సన్నివేశాలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. చివరకు పొలిటీషియన్స్ ఈ స్కైలాబ్ ని కూడా తమకు అనుకూలంగా ఎలా వాడుకున్నారో కామెడీగా చూపించి ఆకట్టుకున్నారు. తెలంగాణలోని బండ లింగంపల్లి అనే ఊరి నేపథ్యంలో ఈ కథని చూపించబోతున్నారు. ఇటీవల తెలంగాణ యాసలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో వస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. మన పెద్దవాళ్ళ జనరేషన్ కి తెలిసిన ఈ కథని మనమంతా కచ్చితంగా చూడాలి. డిఫరెంట్ కథలతో వరుస హిట్లు కొడుతున్న సత్యదేవ్ మరోసారి సరికొత్తగా రాబోతున్నాడు.