Tamannaah Bhatia : నా 19 ఏళ్ళ కెరీర్లో ఇలాంటి డైరెక్టర్ ని చూడలేదు.. వైరల్ అవుతున్న తమన్నా పోస్టు..
ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా తమన్నా నటిస్తున్న ఓదెల 2 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు,
- Saketh U
- Published on- March 10, 2024 / 06:57 PM IST
Tamannaah Bhatia Appreciates Director Sampath Nandi Over Odela 2 Movie
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, హిందీలో తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా తమన్నా నటిస్తున్న ఓదెల 2(Odela 2) సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు,
సంపత్ నంది(Sampath Nandi) కథని అందించి, దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 వస్తుంది. మొదటి పార్ట్ లో హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ లో నటించగా రెండో పార్ట్ లో తమన్నా మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇటీవల మహా శివరాత్రికి ఓదెల 2 సినిమా నుంచి తమన్నా అఘోరా గెటప్ లో ఉన్న లుక్ విడుదల చేశారు. ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో డైరెక్టర్ సంపత్ నంది ఈ లుక్ కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి పోస్టర్ డిజైనింగ్ వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, తమన్నాతో సహా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
సంపత్ నంది పోస్టుకి తమన్నా రిప్లై ఇస్తూ.. ఫిలిం మేకింగ్ అనేది అందరూ కలిసి పనిచేసేది అని నేను నమ్ముతాను. సినిమా అనేది ఒక్కరి విజన్ తో మొదలైనా టీం అందరూ కలిసి పనిచేస్తేనే మంచి అవుట్ పుట్ వస్తుంది. సంపత్ ఇది బాగా అర్ధం చేసుకున్నాడు. నా 19 ఏళ్ళ కెరీర్ లో ప్రతి ఒక్కరి పనిని అభినందించే ఇలాంటి డైరెక్టర్ ని చూడలేదు. అది చిన్న లేదా పెద్ద పని అయినా సంపత్ అది చేసాడు. అందరూ కలిసి పనిచేస్తే పోస్టర్ ఫైనల్ లుక్ వచ్చింది, ఇది అందరికి నచ్చింది. ఓదెల 2 షూట్ లో అడుగు పెట్టి షూటింగ్ ని ఎంజాయ్ చేయడానికి ఎదురు చూస్తున్నాను అని పోస్టు చేసింది. దీంతో తమన్నా పోస్టు వైరల్ గా మారింది.
Also Read : Oscars 2024 : 96వ ఆస్కార్ వేడుకలు మరి కొన్ని గంటల్లో.. లైవ్ ఎక్కడ చూడాలి?
గతంలో తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు నాలుగోసారి ఓదెల 2 సినిమాలో నటిస్తుంది. వీరిద్దరిమధ్య మంచి స్నేహం ఉంది. దాంతోనే ఈ రేంజ్ లో పోస్టు పెట్టింది తమన్నా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
