Oscars 2024 : 96వ ఆస్కార్ వేడుకలు మరి కొన్ని గంటల్లో.. లైవ్ ఎక్కడ చూడాలి?
ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలవ్వనున్నాయి.

Oscars 2024 Awards 96 Academy Awards Live Streaming time and Place Details
Oscars 2024 : ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలవ్వనున్నాయి. గత సంవత్సరం RRR బరిలో ఉండటంతో ఇండియాలో కూడా ఆస్కార్ వేడుకలకు భారీ రీచ్ వచ్చింది. ఈ సారి 96వ ఆస్కార్ అవార్డు వేడుకలు జరగనున్నాయి.
కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ 2024 వేడుక ఘనంగా జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం మార్చ్ 10 రాత్రి 7 గంటలకు మొదలవుతుండగా మన ఇండియన్ కాలమానం ప్రకారం మార్చ్ 11న తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇండియాలో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఆస్కార్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
Also Read : Sharwanand : బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో తండ్రి పాత్రల్లో శర్వానంద్..? శర్వా ప్రయోగాలు చేస్తున్నాడా?
ఇక ఈ సారి కూడా కమెడియన్, నటుడు జిమ్మీ కిమేల్ ఆస్కార్ వేడుకని హోస్ట్ చేయనున్నాడు. దాదాపు 23 కేటగిరీలలో ఆస్కార్ అవార్డులు అందించనున్నారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‍హైమర్ ఏకంగా 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి ఈ సారి ఆస్కార్ అవార్డులు ఎవరిని వరించనున్నాయో చూడాలి.
Tomorrow. 96th Oscars. Who will win?
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 10th at a new time, 7e/4p! #Oscars pic.twitter.com/d8TqSvFYRD
— The Academy (@TheAcademy) March 9, 2024