Tamannaah Bhatia : లేడీ అఘోరగా తమన్నా.. ‘ఓదెల’ మూవీ లుక్ అదిరిందిగా..
మిల్కీ బ్యూటీని ఇప్పటివరకు చూపించిన విధంగా.. సరికొత్తగా లేడీ అఘోర పాత్రలో చూపించబోతున్నారు. 'ఓదెల' సీక్వెల్ లో తమన్నా 'శివశక్తి' రూపంలో దర్శనమిస్తున్నారు.
- gum 95921
- Updated on- March 8, 2024 / 11:30 AM IST
Tamannaah Bhatia first look from Odela 2 movie
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఒక పక్క సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ, మరో పక్క లేడీ ఓరియంటెడ్ కథలకు కూడా సైన్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ సీక్వెల్ కి సైన్ చేసారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథని అందించిన ఈ సినిమా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కి.. 2022లో ముందుకు వచ్చింది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమైన ఈ చిత్రం.. సూపర్ వ్యూస్ అందుకొని ఓటీటీ హిట్ బొమ్మ అనిపించుకుంది. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో మేకర్స్.. ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ ని కూడా కొంచెం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సీక్వెల్ లో తమన్నాని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసుకున్నారు.
Also read : Rajasaab : ‘రాజాసాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..
ఇక ఈ పాత్ర కూడా తమన్నాకి చాలా కొత్తదైనది. మిల్కీ బ్యూటీని ఇప్పటివరకు చూపించిన విధంగా.. సరికొత్తగా లేడీ అఘోర పాత్రలో చూపించబోతున్నారు. నేడు ‘శివరాత్రి’ సందర్భంగా మూవీలోని తమన్నా లుక్ ని షేర్ చేసారు. కాషాయ దుస్తుల్లో తమన్నా ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు. చేతిలో ఢమరుకం, నుదుటిన విబూది, మరో చేతిలో కర్రతో.. ‘శివశక్తి’ రూపంలో దర్శనమిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ కి నెటిజెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి కూడా సంపత్ నందినే కథని అందించబోతున్నారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి థ్రిల్లర్ సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ఈసారి థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.
