Rajasaab : ‘రాజాసాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..
'రాజాసాబ్' పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Prabhas Sreenu interesting comments about Rajasaab movie
Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా కొన్నాళ్ళు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. అయితే ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తూ మూవీని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’ చిత్రీకరణలో బిజీగా ఉండడంతో.. ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.
కాగా ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కబోతుందంటూ మారుతీ చెప్పుకొచ్చారు. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టు సినిమా ఉంటుందని వెల్లడించారు. తాజాగా ఈ మూవీ గురించి ప్రభాస్ అసిస్టెంట్ మరియు మిత్రుడు శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
”రాజాసాబ్ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలులా ఉండవు. ఎప్పుడు చూడని యాంగిల్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఆడియన్స్ లో మూవీ పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.
Also read : Ram Charan : రామ్‌చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ.. వీడియో వైరల్..
#Rajasaab is A Big Project
PAN Indian Movies Kanna Big Project
It’s a Different Kind Of Movie
Eppudu Chudani Angles Chustaru Movie lo ….– #PrabhasSeenu #Prabhas #Maruthi #Thaman #TheRajaSaab #Prabhas? #Kalki2898AD #Spirit pic.twitter.com/In3sKKNlcp
— PrabhasWarriors? (@PRABHASWARRlORS) March 7, 2024
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యింది. ప్రభాస్ కల్కి సెట్స్ నుంచి ఫ్రీ అవ్వగానే ఈ మూవీ బ్యాలన్స్ షూట్ ని కూడా పూర్తి చేసేయనున్నారు.
ఈ సినిమాని హార్రర్ బ్యాక్‌డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీలోని ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైనింగా ఉంటుందట. ఈ మూవీ నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.