Tamannaah Bhatia
Tamannaah Bhatia : ఇండస్ట్రీకి వచ్చి 20 అవుతున్నా ఏ మాత్రం అందం తగ్గకుండా అవకాశాలు తగ్గకుండా సౌత్, నార్త్ లో దూసుకుపోతుంది తమన్నా. మొదట్లో లిప్ కిస్, అడల్ట్ సీన్స్ కి దూరంగా ఉన్న తమన్నా గత కొంతకాలంగా వాటికి కూడా ఓకే చెప్తూ హాట్ సీన్స్ తో అలరిస్తుంది. దీంతో బాలీవుడ్ లో అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి. తాజా బాలీవుడ్ సమాచారం ప్రకారం తమన్నా ఓ అడల్ట్ హారర్ సినిమా సీక్వెల్ లో చేయబోతుందట.(Tamannaah Bhatia)
బాలీవుడ్ అడల్ట్ హారర్ సినిమాల్లో రాగిణి MMS, రాగిణి MMS 2 సినిమాలు స్పెషల్ ప్లేస్ లో ఉంటాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. హారర్ తో పాటు అడల్ట్ సీన్స్ భారీగానే ఉంటాయి ఈ సినిమాల్లో. మొదటి పార్ట్ లో కైనాజ్ మోతివాలా మెయిన్ లీడ్ లో నటించగా, సెకండ్ పార్ట్ లో సన్నీ లియోన్ నటించింది. ఈ సినిమాతోనే సన్నీ లియోన్ బాలీవుడ్ లో స్టార్ అయింది.
Also Read : RGV : ఇండైరెక్ట్ గా పైరసీకి సపోర్ట్ చేసిన ఆర్జీవీ.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నిర్మాతలకు కౌంటర్..
తాజాగా రాగిణి MMS 3 తీస్తున్నారట. ఈ సినిమాలో తమన్నా మెయిన్ లీడ్ లో నటిస్తుందట. దీంతో తమన్నా ఈ సినిమాలో బోలెడన్ని అడల్ట్ సీన్స్ చేయడానికి రెడీ అయిందని సమాచారం. ఇటీవల లస్ట్ స్టోరీస్ సినిమాలో తమన్నా రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. అప్పుడే అంతా ఆశ్చర్యపోయారు. ఇక అడల్ట్ హారర్ సినిమా అయిన రాగిణి MMS సీక్వెల్ లో ఇంకే రేంజ్ లో రొమాన్స్ చూపిస్తుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.