Tamannaah: రవితేజ ‘ఇరుముడి’ మూవీతో తమన్నా రీఎంట్రీ.. ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలెట్
శివ నిర్వాణ డివోషనల్ ఎంటర్టైనర్ ఇరుముడిలో స్పెషల్ రోల్ చేస్తున్న తమన్నా(Tamannaah).
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 09:01 AM IST
Tamannaah playing special role in ravi teja irumudi movie
- టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న తమన్నా
- రవి తేజ సినిమాలో స్పెషల్ రోల్
- ఈసారి గ్లామర్ కాదు డివోషనల్ బ్యాక్డ్రాప్ లో
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మళ్ళీ తెలుగు వెండితెరపై మెరిసేందుకు రెడీ అవుతోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వనుందట. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ముఖ్యంగా ఈ కథ అయ్యప్ప స్వామి మాల, ఇరుముడి చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టులో తమన్నా(Tamannaah) స్పెషల్ రోల్‌లో కనిపించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ ను ఇప్పటికే ఫైనల్ చేశారు మేకర్స్. కానీ, తమన్నా పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
అయితే, ఆమె పాత్ర ఈసారి గ్లామర్ కోసం కాకుండా, కథా పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందట. కాబట్టే తమన్నా ఈ ఆఫర్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రవితేజ, తమన్నా కలిసి ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ కుదిరినప్పటికీ, ఈసారి సరికొత్త నేపథ్యంలో, భక్తి, భావోద్వేగాల కలయికలో రాబోతుండటం విశేషం.
ఇక దర్శకుడు శివ నిర్వాణ తన మార్క్ ఎమోషన్స్‌తో అయ్యప్ప మాల ధరించిన భక్తుల అంతరంగ సంఘర్షణను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారట. సాధారణంగా రవితేజ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్తారు. కానీ, మొదటిసారి ఇలాంటి ఒక డివోషనల్ టచ్ ఉన్న కథను ఎంచుకోవడం ఆయన అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, తమన్నా కెరీర్‌కు తెలుగులో మళ్ళీ మంచి బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
