Vanitha Vijay Kumar : గాయాలతో తమిళ యాక్ట్రెస్ పోస్ట్.. బిగ్‌బాస్ వలనే దాడి జరిగిందా..?
బిగ్‌బాస్ కారణంతో తమిళ యాక్ట్రెస్ పై దారుణంగా దాడి చేశారా..? అసలేం జరిగింది..?
- gum 95921
- Published On : November 26, 2023 / 11:30 AM IST
Tamil Actress Vanitha Vijay Kumar had injured post viral
Vanitha Vijay Kumar : తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ కాంట్రవర్సీలతో నిత్యం వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్‌బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక ప్రదీప్ మధ్య జరిగే గొడవలు మీద వనితా కామెంట్స్ చేస్తూ వస్తుంటారు. అయితే బిగ్‌బాస్ చూసే ఆడియన్స్ కంటెస్టెంట్స్ ని సినిమా స్టార్స్ లాగానే అభిమానిస్తుంటారని అందరికి తెలిసిందే.
ఈక్రమంలోనే ఒకరి ఫ్యాన్స్ మరొకరి పై కామెంట్స్ చేసుకుంటూ నెట్టింట ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ వలనే వనితా గాయాలు పాలైనట్లు తెలుస్తుంది. వనితా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్టులో వనితా గాయాలతో కనిపిస్తున్నారు. తన మీద దారుణమైన దాడి జరిగిందని, బిగ్‌బాస్ అనేది కేవలం గేమ్ మాత్రమేనని, వైలెన్స్ కరెక్ట్ కాదని.. ఆ పోస్టు కింద రాసుకొచ్చారు. ఆమె పై ఎవరు దాడి చేశారు అనే దాని పై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ దాడికి బిగ్‌బాస్ అభిమానులే కారణమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also read : Bigg Boss 7 Day 83 : ఆమె ఎలిమినేషన్.. మళ్ళీ బుజం నొప్పితో శివాజీ బయటకి..
మరికొంతమంది ఇలా కామెంట్స్ చేస్తున్నారు.. ఆమెకు ఎంతోమందితో గొడవలున్నాయి, బిగ్‌బాస్ వల్లే దాడి జరిగిందని మీరు ఎలా డిసైడ్ చేస్తారంటూ క్యూస్షన్ చేస్తున్నారు. అయితే ఆమె పోస్ట్ కింద బిగ్‌బాస్ అని రాసుకురావడంతో.. ఆ కోణంలోనే అందరూ ఈ విషయాన్ని చూస్తున్నారు. ఇంతకీ అసలు ఆమె పై దాడి చేయడానికి గల కారణం ఏంటి..? ఆమె పై దాడి చేసిన వారు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు అయితే నెట్టింట వైరల్ గా మారింది.
