Suriya – Karthi : అన్నయ్యతో కలిసి సినిమా పై కార్తీ కామెంట్స్.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ కలిసి ఒక సినిమా చేయబోతున్నారా..? రీసెంట్ ఇంటర్వ్యూలో కార్తీ ఏం చెప్పాడు..?

Tamil Brothers Suriya Karthi Multi Starrer news

Suriya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ.. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో వీరిద్దరూ మాత్రమే టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. దీంతో వీరి మూవీస్ తమిళంతో పాటు తెలుగు కూడా రిలీజ్ అవుతూ వస్తుంటాయి. అయితే వీరిద్దరిని కలిసి ఒకే స్క్రీన్ పై చూడాలని తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక ఆశ ఉంది. దీంతో వీరిద్దరి మల్టీ‌స్టారర్ గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తుంది.

Leo vs Pushpa 2 : 32 నిమిషాల్లోనే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ ‘లియో’..

తాజాగా దీని గురించి కార్తీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక ఇండస్ట్రీలో పని చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది నేను అన్నయ్య ఈ పరిశ్రమలో కొనసాగుతూ వస్తున్నాము. మేమిద్దరం కలిసి ఒక మూవీ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. మొదటి ఇలా ఒక మూవీ చేయడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు కచ్చితంగా అన్నతో కలిసి ఒక సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మూవీ ఖైదీ 2 నే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ వర్క్స్ కూడా మొదలయ్యాయి.

Ram Charan : ‘క్లీంకార’కు గ్రాండ్ వెల్కమ్ పలికిన రామ్ చరణ్.. చిన్న జీయర్ స్వామి..

ఇక అలాగే సినిమా ఇండస్ట్రీలోకి రావడం గురించి మాట్లాడుతూ.. “నాకు సవాళ్లు ఎదుర్కోవడం అంటే ఇష్టం. సినిమా నాకు ఆ అవకాశం కల్పించింది. ప్రతి మూవీలో నేను సవాలుతో కూడిన పాత్రలు చేసుకుంటూనే వస్తున్నాను. అయితే నేను నటుడిని యాదృచ్ఛికంగా అయ్యాను. నేను దర్శకుడిగా అవ్వాలి అనుకున్నాను. కానీ మా నాన్న ఒక మాట చెప్పారు. నటనకు వయసు ఉంటుంది కానీ దర్శకుడికి కాదు. 60 ఏళ్ళ వయసులోనూ డైరెక్టర్ కావచ్చని చెప్పడంతో నటన వైపు వచ్చాను” అంటూ పేర్కొన్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు