Ram Charan : ‘క్లీంకార’కు గ్రాండ్ వెల్కమ్ పలికిన రామ్ చరణ్.. చిన్న జీయర్ స్వామి..
కామినేని ఇంటి నుంచి కొణిదెల ఇంటికి చేరుకున్న క్లీంకారకు రామ్ చరణ్ గ్రాండ్ వెల్కమ్ పలికాడు.

Ram Charan grand welcome to his daughter Klin Kaara
Ram Charan : దేశమంతా నేడు వినాయక చవితి (Vinayaka Chavithi) సంబరాలు జరుగుతుంటే.. మెగాస్టార్ ఇంట మరో పండగ కూడా జరుగుతుంది. ఇటీవలే చరణ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. అయితే క్లీంకార, ఉపాసన.. ఇన్నిరోజులు కామినేని వారి ఇంటిలో ఉన్నారు. ఇక మూడు నెలలు గడవడంతో నేడు వినాయక చవితి నాడు ఉపాసన, క్లీంకార.. మెగా వారి ఇంటికి వచ్చారు. ఇక వీరిద్దరికి కొణిదెల ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. రామ్ చరణ్ అండ్ చిరంజీవి సతీమణి సురేఖ.. వారసురాలకి వేదమంత్రాలతో వెల్కమ్ పలికేలా ఏర్పాట్లు చేశారు.
Tiger Nageswara Rao : పండక్కి సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు..
చిన్న జీయర్ స్వామి వేద పాఠశాలకు చెందిన స్టూడెంట్స్.. ఉపాసన, క్లీంకారకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. చరణ్‌కి, తన అత్తమ్మకి, వేద పాఠశాల స్టూడెంట్స్ కి థాంక్యూ చెబుతూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈరోజు ఉదయం చిరంజీవి ఇంటిలో విఘ్నేశ్వరుడి పూజలో క్లీంకార కూడా పాల్గొనగా.. ఆ ఫోటోలను రామ్ చరణ్ షేర్ చేశాడు. అవి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
Naga Susheela : అక్కినేని నాగార్జున సోదరి పై పోలీస్ కేసు.. హీరో సుశాంత్‌కి..
View this post on Instagram
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గేమ్ చెంజర్’ (Game Changer) షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా లేటుగా సాగుతుంది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ఒక సాంగ్ లీక్ అవ్వగా నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీనిపై నిర్మాత దిల్ రాజు బాగా సీరియస్ అయ్యి పోలీస్ కంప్లైంట్ కూడా కూడా ఇచ్చాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.