Tiger Nageswara Rao : పండక్కి సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు..
ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్ కి తెరలేపిన చిత్ర యూనిట్.. మూవీలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా సెకండ్ సింగల్..

Raviteja gave Tiger Nageswara Rao second single update
Tiger Nageswara Rao : నూతన దర్శకుడు వంశీ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ని గజదొంగగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్ కి తెరలేపిన చిత్ర యూనిట్.. మూవీలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే మొదటి సింగల్ ‘ఎక్ ధమ్ ఎక్ ధమ్ నచ్చేసావే’ సాంగ్ ని రిలీజ్ చేయగా.. అందరికి బాగా నచ్చేసింది.
Naga Susheela : అక్కినేని నాగార్జున సోదరి పై పోలీస్ కేసు.. హీరో సుశాంత్‌కి..
తాజాగా ఇప్పుడు రెండో సింగల్ కి టైంని ఫిక్స్ చేశారు. నేడు వినాయకచవితి సందర్భంగా మూవీ నుంచి సెకండ్ సింగల్ అప్డేట్ ని రవితేజ ఇచ్చాడు. ‘వీడు’ అని సాగే పాటని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశాడు. రిలీజ్ చేసిన పోస్టర్ చాలా మాస్ గా కనిపిస్తుంది. తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Shakeela : బిగ్‌బాస్ ద్వారా షకీలా ఎంత సంపాదించిందో తెలుసా..?
వినాయకచవితి శుభాకాంక్షలు 🤗#TigerNageswaraRao 2nd single on Sep 21st :))) pic.twitter.com/O7SaV4DEwL
— Ravi Teja (@RaviTeja_offl) September 18, 2023
రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై ఏపీ హైకోర్టులో కేసు నమోదు అవ్వడం, నిర్మాతలకు నోటీసులు వెళ్లడం, స్టూవర్టుపురంకి చెందిన ప్రజలు నిరసనలు తెలపడంతో ఒక వివాదం నడుస్తుంది. ఎరుకల జాతిని, తమ గ్రామాన్ని కించపరిచేవిధంగా సినిమా తీస్తున్నారంటూ స్టువర్టుపురం ప్రజలు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. అయితే ఈ వివాదం పై మూవీ టీం ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాత్రం మాట్లాడలేదు.