Arya : కాశీ సాధువుల్లో క్రిమినల్స్ ఉన్నారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..

ఆర్య తన కెరీర్ స్టార్టింగ్ లో నేనే దేవుడ్ని అనే సినిమా చేసాడు. (Arya)

  • Published On : April 13, 2026 / 09:30 AM IST

Arya

Arya : తమిళ్ తో పాటు తెలుగులో కూడా హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు నటుడు ఆర్య. ఆర్య త్వరలో మిస్టర్ ఎక్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఆర్య తన కెరీర్ స్టార్టింగ్ లో నేనే దేవుడ్ని అనే సినిమా చేసాడు. ఆ సినిమాలో సాధువులా కనిపిస్తాడు ఆర్య. ఆ సినిమాలో కాశీలో చాలా సీన్స్ ఉంటాయి. ఆ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకొని ఆర్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Red : NTR : వామ్మో.. కండలు తిరిగిన బాడీ చూపిస్తూ.. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్.. ఫోటో వైరల్..

ఇంటర్వ్యూలో ఆర్య మాట్లాడుతూ.. నాన్ కడువలే(నేనే దేవుడ్ని) షూటింగ్ కి కాశీ కి వెళ్ళాం. అక్కడ సాధువులు ఉంటారు. మంచి వాళ్ళు, నిజమైన సాధువులు 60 శాతం మంది ఉన్నారు. కానీ 40 శాతం మంది నకిలీ సాధువులు ఉన్నారు. వాళ్లంతా క్రిమినల్స్. ఈ నకిలీ స్వాములంతా వాళ్ళ పేర్లు చెప్పారు. అడిగినా స్వామి అని మాత్రమే చెప్తారు. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి లాంటివి ఏమి ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కొని వెళ్ళిపోతారు.

కుంభమేళాలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మేము కుంభమేళా షూటింగ్ కి వెళ్ళినప్పుడు పోలీసులు మాకు జాగ్రత్తలు చెప్పారు. కొంతమంది దగ్గర తుపాకులు ఉంటాయి అని చెప్పారు. సాధువుల ముసుగులో కొంతమంది క్రిమినల్స్ తిరుగుతారు అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆర్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు విమర్శలు చేస్తుండగా, పలువురు సపోర్ట్ చేస్తున్నారు.

Also Read : Director : టీంఇండియా క్రికెటర్ అవ్వాల్సినవాడు.. కుళ్ళు రాజకీయాలు.. కట్ చేస్తే బాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్..