NTR : వామ్మో.. కండలు తిరిగిన బాడీ చూపిస్తూ.. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్.. ఫోటో వైరల్..
తాజగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కండలు తిరిగిన బాడీ చూపిస్తూ ఎన్టీఆర్ ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.(NTR)
NTR
NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నపడ్డారు. ఇటీవల షూటింగ్ సమయంలో, బయట ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ చూసి ఎన్టీఆర్ ఏంటి ఇంత సన్నబడ్డాడు అని ఆశ్చర్యపోతున్నారు.
తాజగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కండలు తిరిగిన బాడీ చూపిస్తూ ఎన్టీఆర్ ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటో షేర్ చేస్తూ ఇది పెంచుకున్నది, కొనుక్కున్నది కాదు అంటూ పోస్ట్ చేసాడు. కుమార్ మన్నవ అనే కోచ్ ఎన్టీఆర్ ఈ రేంజ్ లో బాడీ పెంచడానికి సహాయం చేసాడు.
ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసమే అని కూడా ఎన్టీఆర్ ఆ సినిమాని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసాడు. దీంతో డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోనుందని, సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తాడేమో అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఫొటోతో సోషల్ మీడియాని ఎన్టీఆర్ షేక్ చేసేస్తున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని ట్రోల్స్ వస్తే తాను ఏ రేంజ్ లో మారి అందరికి సమాధానం ఇచ్చాడో తెలుసు. ఇప్పుడు మరోసారి తన బాడీతో డ్రాగన్ సినిమాలో అదరగొట్టబోతున్నాడు ఎన్టీఆర్.
Also Read : Asha Bhosle : లతా మంగేష్కర్, ఆశా భోస్లే.. అక్కాచెల్లెళ్ల పుట్టుక, మరణం.. ఎన్ని యాదృచ్ఛికాలో..
