Asha Bhosle : లతా మంగేష్కర్, ఆశా భోస్లే.. అక్కాచెల్లెళ్ల పుట్టుక, మరణం.. ఎన్ని యాదృచ్ఛికాలో..
ఈ అక్కాచెల్లెళ్ల పుట్టుక, మరణాల మధ్య కొన్ని యాదృచ్ఛికాలు ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. (Asha Bhosle)
Asha Bhosle
Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఆదివారం నాడు మధ్యాహ్నం కన్నుమూశారు. దేశమంతా ప్రముఖులు, ఆమె అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. నేడు మధ్యాహ్నం ముంబైలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆశా భోస్లే అక్క, మరో లెజెండరీ సింగర్, భారత రత్న లతా మంగేష్కర్ కూడా నాలుగేళ్ళ క్రితం మరణించారు.
అయితే ఈ అక్కాచెల్లెళ్ల పుట్టుక, మరణాల మధ్య కొన్ని యాదృచ్ఛికాలు ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Devara 2: ‘దేవర 2’లో మక్కల్ సెల్వన్.. తారక్‌తో తలపడనున్న విజయ్ సేతుపతి!
#లతా మంగేష్కర్, ఆశా భోస్లే ఇద్దరూ కూడా 92వ సంవత్సరంలోనే మరణించారు.
#ఈ ఇద్దరూ కూడా ఆదివారమే మరణించారు.
#ఈ ఇద్దరి మధ్య నాలుగేళ్ళ గ్యాప్ ఉంది. లతా మంగేష్కర్ 1929 లో పుట్టగా ఆశా భోస్లే 1933లో పుట్టారు.
#ఈ ఇద్దరి మరణానికి కూడా నాలుగేళ్లు గ్యాప్ ఉండటం గమనార్హం. లతా మంగేష్కర్ 2022లో మరణించగా, ఆశా భోస్లే 2026లో మరణించారు.
#ఈ ఇద్దరూ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ ఒకే హాస్పిటల్ లో మరణించడం గమనార్హం. ఈ ఇద్దరూ ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లోనే మరణించారు.
#ఈ ఇద్దరూ సింగర్స్ గా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, అభిమానులను సంపాదించుకున్నారు.

