Tamil Music Directors : అనిరుధ్ వర్సెస్ జీవీ ప్రకాష్.. తెలుగులో పోటీ పడుతున్న తమిళ సంగీత దర్శకులు..

పాన్‌ ఇండియాని రూల్‌ చేస్తోన్న అనిరుధ్‌కి టాలీవుడ్‌లో మాత్రం జీవి ప్రకాష్ టఫ్‌ ఫైట్‌ ఇస్తున్నాడు. (Tamil Music Directors)

  • Published on- October 28, 2026 / 03:30 PM IST

Tamil Music Directors

Tamil Music Directors  : ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి అనే డైలాగ్‌లా ప్రస్తుతం పాన్ ఇండియాని రూల్‌ చేస్తున్నాడు అనిరుధ్‌ రవిచందర్‌. లేటెస్ట్‌గా జైలర్ 2 సినిమాతో తన బీట్‌కి ఏ మాత్రం పవర్‌ తగ్గలేదని నిరూపించాడు ఈ బక్కోడు. అంతేకాదు నేచురల్‌ స్టార్ నాని ది ప్యారడైజ్‌ సినిమాలో ఆయా షేర్‌, ఏషనాగుల గట్టమీద సాంగ్స్‌తో ఈ ఇయర్‌ టాలీవుడ్‌ని ఊపేసాడు.

దీంతో అనిరుధ్‌కి తెలుగులో ప్రస్టేజియస్‌ ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే బాలయ్య-కొరటాల శివ సినిమా, అల్లు అర్జున్‌-లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కే AA23తో పాటు.. NTR-త్రివిక్రమ్‌ మైథలాజికల్‌ పాన్‌ ఇండియా మూవీ గాడ్‌ ఆఫ్‌ వార్‌కి సైతం అనిరుధే బీట్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. అంతేకాదు MS సుబ్బలక్ష్మి బయోపిక్‌గా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కే MS ఏ లెగసీ ఆన్‌ స్క్రీన్‌ సినిమాకి కూడా అనిరుధ్‌ రవిచందరే మ్యూజిక్‌ డైరెక్టర్.

Also Read : Varanasi : మహేష్ బాబు ‘అర్జున్’ షూటింగ్ చేసిన చోటే.. ‘వారణాసి’ షూట్..?

అయితే టాలీవుడ్ లో అనిరుధ్ కి ఇప్పుడు సొంత పరిశ్రమ నుంచే జీవి ప్రకాష్ పోటీ ఇస్తున్నాడు. బాలయ్య హీరోగా కొరటాల శివ డైరెక్ట్‌ చేసే NBK112 ప్రాజెక్ట్‌ ఇప్పుడు అనిరుధ్‌ నుంచి జీవీ ప్రకాశ్‌ చేతుల్లోకి వెళ్తుందంటూ న్యూస్‌ వైరలవుతోంది. ఈ ఇయర్‌ విశ్వనాథ్ అండ్‌ సన్స్, ఇరుముడి లాంటి బ్లాక్‌బాస్టర్స్‌తో పాటు మ్యూజికల్‌ హిట్‌ శ్రీనివాస మంగాపురం సినిమాతో తెలుగులో సత్తా చాటారు జీవీ ప్రకాశ్‌. అంతేకాదు హిట్ మిషన్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ జనవరి 12 విడుదల సినిమా సహా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న శ్రీశ్రీ, ఆకాశంలో ఒక తార సినిమాలకి జీవీ ప్రకాశే స్వరాలు అందిస్తున్నారు.

దీంతో బిజీయస్ట్ కంపోజర్‌గా పాన్‌ ఇండియాని రూల్‌ చేస్తోన్న అనిరుధ్‌కి టాలీవుడ్‌లో మాత్రం జీవి ప్రకాష్ టఫ్‌ ఫైట్‌ ఇస్తున్నాడు.