Chiranjeevi – Ajith : తమిళ్ స్టార్‌ హీరోతో మన మెగాస్టార్.. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోలు..

అజిత్ తో దిగిన ఫోటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేశారు.

Tamil Star Ajith Kumar met Megastar Chiranjeevi in Vishwambhara Sets

Chiranjeevi – Ajith : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు. శరవేగంగా ఈ సినిమా షూట్ జరుగుతుంది. అయితే నిన్న విశ్వంభర షూట్ లోకి తమిళ్ స్టార్ హీరో అజిత్ వచ్చారు. అజిత్ షూట్ కూడా విశ్వంభర పక్క సెట్ లోనే జరుగుతుండటంతో ఈ ఇద్దరు స్టార్స్ కలిశారు. అజిత్ తో దిగిన ఫోటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేశారు.

Also Read : Pushpa 2 Song : పుష్ప 2 నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..

చిరంజీవి అజిత్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. నిన్న సాయంత్రం విశ్వంభర సెట్ లోకి అనుకోకుండా ఓ అతిధి వచ్చారు. పక్క సెట్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ నా దగ్గరకు వచ్చి కాసేపు గడిపారు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అజిత్ తెలుగులో మొదటి సినిమా ప్రేమ పుస్తకం సమయంలో విషయాలు గుర్తుచేసుకున్నాం. ఆ సినిమా ఆడియో లాంచ్ నేనే చేశాను. అజిత్ భార్య షాలిని జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తుచేసుకున్నాము. అజిత్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అదే మంచితనంతో ఉన్నాడు అని తెలిపారు.

 

దీంతో చిరంజీవి చేసిన పోస్ట్, ఫోటోలు వైరల్ గా మారాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు, తమిళ్ అజిత్ ఫ్యాన్స్ ఈ ఫోటోలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు