×
Ad

Thalapathy Vijay: సినిమాలకు ఇక సెలవు.. అభిమానుల సమక్షంలో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విజయ్‌..

తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన తన అభిమానుల సమక్షంలో అధికారికంగా తెలియజేశాడు.

Tamil star hero Vijay announced his retirement from movies

Thalapathy Vijay: తమిళ స్టార్ నటుడు విజయ్ తన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ నటుడు సినిమాలకు దూరం అవుతున్నారు అంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయంపై. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన చేశాడు విజయ్. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(తెలుగులో జన నాయకుడు). ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపధ్యంలోనే తాజాగా మలేషియాలో జన నాయగన్ ఆడియో రిలీజ్ ఈవెన్ నిర్వహించారు మేకర్స్.

‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..

ఈవెంట్ లో హీరో విజయ్(Thalapathy Vijay) అభిమానుల సమక్షంలో తన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా కోసం చాలా మంది ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. ఇంతకాలం నన్ను సపోర్ట్‌ చేసిన వారికి ధన్యవాదాలు. వారికోసం మరో 30 ఏళ్లపాటు నేను నిలబడతా. నా అభిమానులకు సేవ చేసుకోవడం కోసమే సినిమాలకు దూరం అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, సినిమాలకు విజయ్ దూరం అవుతున్నాడు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. దీంతో, విజయ్ ఫ్యాన్స్ ఎమోషనల్ ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో ఇక వెండితెరపై కనిపించడా అంటూ బాధపడుతున్నారు.