‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..

'రాజాసాబ్(Rajasaab)'లో ప్రభాస్ నాన్నమ్మగా చేస్తున్న నటి జరీనా వాహబ్. ఒకప్పటి స్టార్ బ్యూటీ మన తెలుగమ్మాయే మీకు తెలుసా?

‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..

Do you know about Zarina Wahab, who acted in Raja Saab_

Updated On : December 28, 2025 / 12:37 PM IST

Rajasaab: ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో వస్తున్న వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్(Rajasaab)’. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేయగా తాజాగా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమాలో నానమ్మ పాత్రలో నటించిన నటి గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇది నాన్నమ్మ, మనవడి కథ అని, నేను కాదు ఆమె కూడా ఈ సినిమాలో హీరోనే అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ నటి ఎవరు అనేది తెల్సుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Posani Krishna Murali: పోసాని హీరోగా కొత్త మూవీ.. పొలిటికల్ రీఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్..

ఆ నటి మరెవరో కాదు జరీనా వాహబ్. ఈమె ఒక బాలీవుడ్ నటి. అంటే కేవలం హిందీ మాత్రమే కాదు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆమె చాలా సినిమాల్లో నటించింది. జరీనా వాహబ్ విశాఖపట్నానికి చెందిక ఇక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ, సినిమాల పట్ల తనకున్న మక్కువ ఆమెను బాలీవుడ్ వైపు నడిపించింది. ఆలా ఆమె మొదటగా వెండితెరపై కనిపించిన సినిమా ‘ఇష్క్.. ఇష్క్.. ఇష్క్’. 1974లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ టాప్ నటిగా ఎదిగింది. నిజానికి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నిర్మాత రాజ్ కపూర్ ఆమెను సినిమాలకు పనికిరావు అంటూ రిజెక్ట్ చేశాడట.

కానీ, ఆమె మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి చేసి చివరకు నటిగా టాప్ పొజిషన్ కి వెళ్ళింది. ఇక ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా గాజుల కిష్టయ్య. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఆమె అమర ప్రేమ, హేమా హేమీలు వంటి కొన్ని తెలుగు సినిమాల్లోనే నటించింది. ఇక రీసెంట్ గా రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, విశ్వరూపం, విరాట పర్వం, దసరా, దేవర వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక 1986లో ఆమె నటుడు ఆదిత్య పంచోలిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అతను ఆమెకంటే 6 సంవత్సరాలు చిన్న. వీరికి ఇద్దరు సంతానం. వారు కూడా నటులే. ఇప్పుడు మళ్ళీ ఆమె రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలో ఆమె ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తారు అనేది చూడాలి.