Posani Krishna Murali: పోసాని హీరోగా కొత్త మూవీ.. పొలిటికల్ రీఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్..
పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) హీరోగా కొత్త సినిమా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 ఫిబ్రవరిలో విడుదల అవుతుంది.
Posani Krishna Murali interesting comments about movies and political re-entry
Posani Krishna Murali: టాలీవుడ్ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కొన్ని తరాల నుంచి ఆయన తన నటనతో తెలుగు ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు. ఆలాగే ఆయన ఒక మంచి రచయిత, దర్శకుడు కూడా. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, గత కొంత కాలంగా ఆయన రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే, రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చిన పార్టీ ఓడిపోవడంతో సినిమాల్లో బిజీ అవడానికి సిద్ధం అవుతున్నాడు.
Prabhas: ఏంటి ప్రభాస్ కమెడియనా.. సప్తగిరి అంత మాట అన్నాడేంటి.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారుగా
తాజాగా ఆయన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కోసం వచ్చారు. ఈ సందర్బంగా 10టీవీతో ఎక్సక్లూసివ్ గా మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై, సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎప్పుడు ప్రశాంతగానే జరుగుతాయి. నేను గత 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. కేవలం ఎలెక్షన్ టైం లో మాత్రమే ఈ హడావుడి ఉంటుంది. ఎలక్షన్ అయ్యాక అందరు మళ్ళీ కలిసిపోయే ఉంటారు. ఇక్కడ ఎన్ని వర్గాలు ఉన్నాయి అనేది నాకు తెలియదు. నేను ఏ వర్గం మనిషి కాదు. ఎటువైపు మంచి ఉంటే అంటే నేను ఉంటాను.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం నేను ఆపరేషన్ అరుణ రెడ్డి అనే సినిమా చేస్తున్నాను. ఇది ఒక నిజాయితీగా ఉండే జర్నలిస్టు కథ. ఒక జర్నలిస్టు హానెస్ట్ ఉంటే ఇండియా మొత్తం ఆ జర్నలిస్టునే చూస్తుంది. అతనివైపే ఉంటుంది అని చెప్పే కథ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి లో రిలీజ్ అవుతుంది. ప్రస్థుతానికి పాలిటిక్స్ లేవు. ఏదైనా ఉంటె నేనే చెప్తా. ఇక రాజకీయాల గురించి అంటే ఏదైనా ఉంటే నేనే చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
