Prabhas: ఏంటి ప్రభాస్ కమెడియనా.. సప్తగిరి అంత మాట అన్నాడేంటి.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారుగా
ప్రభాస్(Prabhas) పెద్ద కమెడియన్ అటూ సప్తగిరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సప్తగిరిని ట్రోల్ చేస్తున్నారు.
Sapthagiri made interesting comments, calling Prabhas a comedian.
Prabhas: కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ, మాటలు తప్పుగా వస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే టాలీవుడ్ కమెడియన్ సప్తగిరికి ఎదురయ్యింది. రీసెంట్ గా ఆయన ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ ను కమెడియన్ అనేశాడు. దాంతో సప్తగిరిని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Naga Chaitanya-Clax: క్లాక్స్ కథ చైతూకి బాగా నచ్చేసిందట.. మహారాజ టైపులో.. పాటలు, ఫైట్లు గట్రా..
హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. మీరు ఇప్పటివరకు చాలా మంది కమెడియన్స్ ని చూసి ఉంటారు. కానీ, ప్రభాస్ అందరికన్నా పెద్ద కమెడియన్ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే, ఆయన ఉద్దేశం ప్రభాస్ కమెడియన్స్ కంటే ఎక్కువ కామెడీ ఈ సినిమాలో చేశాడని.
కానీ, ఇప్పుడు సప్తగిరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సప్తగిరిని సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు. “ప్రభాస్ అనేవ్యక్తి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఒక సినిమాలో కామెడీ బాగా చేస్తే కమెడియన్ అయిపోతాడా. కొంచం చూసుకొని మాట్లాడాలి కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై సప్తగిరి ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.
