Tammareddy Bharadwaja: హీరోలు జోక్యం చేసుకుంటే బూతులు తిడ‌తా.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

సినిమా విషయంలో హీరోలు ఎక్కువుగా ఇన్వాల్వ్ అయితే బూతులు తిడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja).

Tammareddy Bharadwaja Shocking Comments About Tollywood Heroes

  • హీరోల జోక్యంపై తమ్మారెడ్డి కామెంట్స్
  • బూతులు తిడతానంటూ ఫైర్
  • వైరల్ అవుతున్న కామెంట్స్

Tammareddy Bharadwaja: సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ ‘వదల’. జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. గ్రిప్పింగ్ నరేషన్, ఉన్నతమైన సాంకేతిక విలువలతో కూడిన ఈ టీజర్, సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను ఆసక్తికరంగా ఆవిష్కరించింది. చాలా కాలం తర్వాత తమ్మారెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక సీరియస్ థ్రిల్లర్‌గా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది.

The Paradise: నాని ఫ్యాన్స్ కి మళ్ళీ బ్యాడ్ న్యూస్.. మరోసారి ‘ది ప్యారడైజ్’ వాయిదా?

ఈ సినిమా ప్రచార చిత్రాల విడుదల సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోలు అతిగా జోక్యం చేసుకుంటే తనకు తీవ్ర అసహనం కలుగుతుందని, బూతులు తిట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. కానీ వదల సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, జగపతి బాబు వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చారు. ఒక ఇంత డెడికేషన్ తో ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వగలడా అనే స్థాయిలో ఆయన పని చేశారని అన్నారు.

ఇక టెక్నికల్ టీమ్ సైతం నెల రోజులుగా నిద్ర లేకుండా కష్టపడి ఈ చిత్రాన్ని చేశారని తమ్మారెడ్డి వివరించారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుతో పాటు అందరూ డెడికేషన్‌తో పని చేయడం వల్లే ఈ క్వాలిటీ సాధ్యమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీజర్‌లో కనిపిస్తున్న ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లయ రీ-ఎంట్రీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అనుభవజ్ఞులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ ‘వదల’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.