The Paradise: నాని ఫ్యాన్స్ కి మళ్ళీ బ్యాడ్ న్యూస్.. మరోసారి ‘ది ప్యారడైజ్’ వాయిదా?
నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్(The Paradise) మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది?
Nani The Paradise movie set to be postponed once again.
- నాని ప్యారడైజ్ విడుదల మరోసారి వాయిదా.
- ఆగస్టు నుండి సెప్టెంబర్‌కు మార్పు సూచన.
- త్వరలో సుజీత్ బ్లడీ రోమియో ప్రారంభం.
The Paradise: నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్యారడైజ్(The Paradise)’. సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టీజర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నిజానికి మార్చి 26వ తేదీనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం పట్టేలా ఉండటంతో, నిర్ణీత గడువులోగా సినిమా సిద్ధమవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆగస్టులోనే సినిమాను థియేటర్లలోకి తెస్తామని ధీమాగా చెబుతున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మరోసారి విడుదల తేదీ మారే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలకు ఈ చిత్రాన్ని వాయిదా వేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఈ వాయిదా విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక, లేటెస్ట్ న్యూస్ తో నాని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ పోన్ అయిన సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అనడం భాదగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ది ప్యారడైజ్ సినిమా రిజల్ట్ అనేది నాని కెరీర్లో అత్యంత కీలకం కానుంది. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే క్రేజీ ప్రాజెక్టును కూడా ఆయన పట్టాలెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
