Faria abdullah: ఆయన కోసమే ఇండస్ట్రీకి వచ్చాను.. ఒక్కసారైనా కలవాలని ఉండేది.. క్రేజీ కామెంట్స్ చేసిన ఫరియా అబ్దుల్లా
కేవలం దుల్కర్ సల్మాన్ ను కలవాలనే ఉద్దేశ్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన ఫరియా అబ్దుల్లా(Faria abdullah).
faria abdullah crazy comments on dulquer salmaan
- దుల్కర్ కోసమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.
- చార్లే సినిమా చూసి నటనపై ఆసక్తి.
- త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీ.
Faria abdullah: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ‘చిట్టి’గా గుర్తింపు పొందింది ఫరియా అబ్దుల్లా. ఈ ఒక్క సినిమాతో ఆడియన్స్ లో తనదైన ముద్రను వేసుకుంది. అయితే, తాజాగా తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టింది ఈ అమ్మడు. సాధారణంగా నటీమణులు తమ అభిమాన నటుల గురించి మాట్లాడటం సహజమే కానీ, ఫరియా మాత్రం తాను ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధాన కారణం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దుల్కర్ నటించిన ‘ఛార్లే’ సినిమా చూసిన తర్వాతే తనలో నటి కావాలనే కోరిక బలంగా కలిగిందని ఆమె స్పష్టం చేసింది.
Nabha Natesh: సొంతూరు జ్ఞాపకాల్లో నభా నటేష్.. అమ్మనాన్నతో కలిసి శృంగేరి వెళ్లిన ఇస్మార్ట్ బ్యూటీ
దుల్కర్ సల్మాన్‌పై ఉన్న అమితమైన ఇష్టంతోనే తాను సినిమాల్లోకి అడుగుపెట్టానని ఫరియా(Faria abdullah) తెలిపింది. ‘ఛార్లే’ చిత్రంలో హీరోయిన్ పాత్రను చూసినప్పుడు అందులో తనను తాను ఊహించుకున్నానని, కనీసం ఒక్కసారైనా దుల్కర్‌ను కలవాలనే లక్ష్యంతోనే ఈ రంగం వైపు వచ్చానని పేర్కొంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన, స్టైల్‌కు తాను పెద్ద అభిమానని, ఆయన నటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఈ ‘ఫ్యాన్ గర్ల్’ తన అనుభూతిని వివరించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తుండటంతో పాటు మరికొన్ని క్రేజీ ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నాయి. కేవలం నటిగానే కాకుండా, సోషల్ మీడియాలో తనదైన శైలిలో డ్యాన్స్ వీడియోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తన కలల హీరోని కలవడమే లక్ష్యంగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ భామ, ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం విశేషం.
