Modern Missamma : ‘మోడ్రన్ మిస్మమ్మ’ నుంచి ఈ సాంగ్ విన్నారా.. అమ్మాయిలు మీ కోసమే..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి.. (Modern Missamma)
- Saketh U
- Updated on- August 20, 2026 / 07:30 AM IST
Modern Missamma
Modern Missamma : లాస్య & మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మాణంలో సాయిబాబా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మోడ్రన్ మిస్మమ్మ’. ఈ సినిమాలో హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తుండగా సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ..’ అంటూ సాగిన ఈ పాటని గోపీ సుందర్ సంగీత దర్శకత్వంలో కిట్టు విస్సప్రగడ రాయగా సాహితి చాగంటి, భవాని రాకేష్ పాడారు. ఈ కాలంలో అమ్మాయిలకు పెళ్లి వడ్డీ సింగిల్ గా ఉండటమే ముద్దు అన్న కోణంలో ఈ పాట సాగుతుంది.
Also Read : Yami Gautam : కామెడీ ట్రాక్ లోకి వచ్చిన యామీ గౌతమ్.. దసరాకి..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన వదల సినిమా నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ.. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీమియర్ చూశాను. సినిమా చూసేటప్పుడు నేను లోపాలు వెతుకుతాను. కానీ ఇందులో ఒక్కటి కూడా దొరకలేదు అని అన్నారు. హీరో హర్ష నర్రా మాట్లాడుతూ.. మిస్సింగ్, రోటి కపడా రొమాన్స్ తర్వాత ఇది నా మూడో సినిమా. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆడలేదు. అయినా నా పోరాటం ఆగదు అని అన్నారు. హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ.. 23 సినిమా తర్వాత నేను నటించిన సినిమా ఇదే. నాగార్జున మన్మధుడు సినిమాలోని ‘వద్దురా సోదరా’ సాంగ్ మగవాళ్లకు కనెక్ట్ అయినట్టు ఈ సాంగ్ ఆడవాళ్లకు కనెక్ట్ అవుతుంది అని తెలిపింది.
డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ.. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతారు. దానికి నేనొకటి యాడ్ చేద్దామనుకుంటున్నా. సినిమా చేసి చూడు అని. ఈ మూడింటిలో అదే కష్టం ఉంటుంది అని నమ్ముతున్నా. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే ధైర్యం కావాలి. ఎన్టీఆర్ గారి ‘మిస్సమ్మ’, భూమిక గారి ‘మిస్సమ్మ’ ఈ రెండు చాలా అడ్వాన్స్ సినిమాలు. మా సినిమాలో కూడా అలాంటి దమ్ము ఉందని నమ్మాం. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అని చెప్పారు. నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో కాలింగ్ సహస్ర తర్వాత వస్తోన్న రెండో సినిమా ఇది. ఆ సినిమాకు మేం ఊహించిన రిజల్ట్ రాలేదు కానీ ఈ సినిమాకు ఆదరణ వస్తుందని నమ్ముతున్నా అని అన్నారు.
Also See : Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్..
