Ananya Nagalla : తిరుమల శ్రీవారి నడక దారిలో టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్
తిరుమల శ్రీవారి నడక దారిలో టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ. వైరల్ అవుతున్న వీడియో.
- gum 95921
- Published On : March 18, 2024 / 01:05 PM IST
Tantra Actress Ananya Nagalla at tirumala video gone viral
Ananya Nagalla : టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ.. ఒక పక్క హీరోయిన్‌గా, మరో పక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినిమాల్లో తన యాక్టింగ్‌తో, సోషల్ మీడియాలో తన అందాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సంపాదించుకున్నారు. తాజాగా ఈ హీరోయిన్ ‘తంత్ర’ అనే హార్రర్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. గత వీకెండ్ రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ నే అందుకుంది.
దీంతో ఈ హీరోయిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. వెంకన్న దర్శనం కోసం నడక మార్గంలో బయలుదేరి ఏడుకొండలు ఎక్కారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కేవలం అనన్య మాత్రమే కనిపిస్తున్నారు. సింగల్‌గా చాలా సింపుల్ లుక్స్ లో హీరోయిన్ గా కాకుండా ఒక భక్తురాలిగా కనిపిస్తూ అనన్య అనన్య అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
Also read : Harika Narayan : స్టార్ సింగర్ పెళ్ళిలో.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ సందడి..
Stepping forward with faith: @AnanyaNagalla’s pilgrimage on foot to TTD for her film’s triumph.?#AnanyaNagalla #Tantra #tantramovie pic.twitter.com/CEacupzEdh
— IndiaGlitz Telugu™ (@igtelugu) March 18, 2024
ఇక తంత్ర మూవీ విషయానికి వస్తే.. హీరోయిన్ పాత్ర చేసిన అనన్యకి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. తన పై ఎవరో క్షుద్రపూజలు చేస్తారు. ఆ విషయాన్ని ఆమె ప్రియుడు, హీరో పాత్ర చేసిన ధనుష్ రఘుముద్రి గ్రహిస్తాడు. కాగా ప్రతి పౌర్ణమి రోజున హీరోయిన్ దగ్గరకి ఒక పిశాచి వస్తుంటుంది. అసలు హీరోయిన్ కి దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి..? ఏమి జరిగింది అనేవి తెర పై చూడాలి.
నరేష్ బాబు, రవి చైతన్య నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుష్ రఘుముద్రి.. హీరో శ్రీహరి సోదరుడు కొడుకు. మూవీలో తన పాత్ర స్క్రీన్ ప్రెజెన్స్ అయ్యినప్పటికీ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు. ఆర్ఆర్ రుద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
