Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. వెంటిలేటర్‌పైనే కొనసాగుతున్న వైద్యం

నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురికావడంతో ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్సనందిస్తున్నారు. తొలుత కుప్పంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, అటుపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆయన త్వరగా కోలుకోవాలని అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు.

Taraka Ratna: నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురికావడంతో ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్సనందిస్తున్నారు. తొలుత కుప్పంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, అటుపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆయన త్వరగా కోలుకోవాలని అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు.

Taraka Ratna : అందరి ప్రార్థనలతో కోలుకుంటున్నాడు..

కాగా, తాజాగా మరోసారి తారకరత్న హెల్త్ అప్డేట్‌ను వైద్యులు రిలీజ్ చేశారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని.. కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తాజా హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు.

Taraka Ratna Health : తారకరత్నని చూసేందుకు బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫోటోలు..

ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని నిరంతరం తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు