Tejeswini Nandamuri : బాబోయ్.. బాలయ్య కుతూర్లో ఇంత ట్యాలెంట్ ఉందా.. డ్యాన్స్ అదరగొట్టిన తేజస్విని.. వీడియో వైరల్..

ఇటీవల కొన్ని రోజుల క్రితం తేజస్విని ఓ జ్యువెల్లరీ యాడ్ లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. (Tejeswini Nandamuri)

  • Updated on- May 29, 2026 / 09:05 PM IST

Tejeswini Nandamuri

Tejeswini Nandamuri : ఒకప్పుడు సైలెంట్ గా మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తేజస్విని ఇప్పటికే నిర్మాతగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా సినీ పరిశ్రమలో పనిచేస్తుంది. ఆల్రెడీ బాలయ్య బాబు చేసిన అన్‌స్టాపబుల్ షోకి కూడా తేజస్విని పనిచేసింది.

ఇటీవల కొన్ని రోజుల క్రితం తేజస్విని ఓ జ్యువెల్లరీ యాడ్ లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నందమూరి రక్తం కదా అందుకే యాక్టింగ్ కూడా ఇంత ఈజీగా చేసేసింది, కానీ ఇన్నాళ్లు ఎందుకు దాచేసింది అనుకున్నారు. తేజస్విని సినిమాల్లో కూడా నటించొచ్చు అన్నారు ఫ్యాన్స్. నటిస్తారు అని వార్తలు వచ్చాయి. తాజాగా తేజస్విని ఓ డ్యాన్స్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.

Also Read : Peddi Pre Release Event : పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ అనౌన్స్.. ఇది అస్సలు ఊహించలేదు.. ఎక్కడ, ఎప్పుడు తెలుసా?

తేజస్విని తాజాగా తన సోషల్ మీడియాలో మరో వ్యక్తితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో తేజస్విని డ్యాన్స్ అదరగొట్టేసింది. తేజస్వినిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తే ఎందుకు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు అని ఫ్యాన్స్ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు.

మొన్న యాక్టింగ్, ఇవాళ డ్యాన్స్.. మొత్తానికి బాలకృష్ణ కూతురు తేజస్విని కూడా తన ట్యాలెంట్స్ తో నందమూరి అభిమానులను మెప్పిస్తుంది. ఏదో ఒకరోజు సినిమా స్క్రీన్ పై తేజస్విని కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీరుకూడా బాలయ్య కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో చూసేయండి..

 

Also Read : Sandeep Reddy Vanga : ఇదెక్కడి కాంబోరా మామ.. ఈ ఇద్దరితో సినిమా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగ..