మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా సైరా విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైరా సినిమా గురించి గతకొద్ది రోజులుగా ఉయ్యాలవాడ వారసులు చిత్రబృందంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే..
ఈ నేపథ్యంలో ముందుగా సైరా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అని చెప్పి, ఇప్పుడు చరిత్ర అంటున్నారని.. తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. సైరా సినిమా విషయంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్ట్ తేల్చి చెప్పింది. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించలేరని.. సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకుల అభిప్రాయానికే వదిలెయ్యాలని.. సినిమాను కేవలం వినోదసాధనంగానే చూడాలి.. ఇప్పుడు విడుదలను ఆపలేమని.. సైరా చిత్రం విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Red Also : అల వైకుంఠపురములో.. ఓవర్సీస్ రైట్స్ సోల్డ్..
అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీగా విడుదల కానుంది.