LGBT Movie : ఎల్‌జీబీటీ పార్ట్ 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయం.. మంత్రి కామెంట్స్..

తాజాగా ఈ సినిమా 50 డేస్ కార్యక్రమం నిర్వహించారు. (LGBT Movie)

  • Published on- August 4, 2026 / 09:21 AM IST

LGBT Movie

LGBT Movie : సామాజిక అంశాల పై సినిమాలను తీసే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఇటీవల శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ట్రాన్స్‌జండర్స్ జీవితాల మీద కోర్ట్ రూమ్ డ్రామాగా “ఎల్‌జిబీటీ – ఏ లీగల్ బ్యాటిల్” అనే సినిమా తీశారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా 50 డేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ ఈవెంట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తుంది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది. అందుకే ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్ 2’ సినిమా నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము అని అన్నారు.

Also Read : Geetha Singh : కితకితలు హీరోయిన్ గీత సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు మా సినిమాను 50 రోజులు ఆదరించి విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలి అని అన్నారు. అలాగే.. గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ అధినేత విమల్ రాజ్ మాథుర్ ఈ సినిమాని హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నామని, పార్ట్ 2 మేమే నిర్మిస్తామని తెలిపారు.