‘ఒక విజయ గాధ’: సిల్క్ స్మిత పాత్రలో అనసూయ!

  • Publish Date - December 9, 2020 / 11:14 AM IST

న్యూస్ ప్రెజెంటర్‌గా ప్రస్థానం ప్రారంభించి.. హోస్ట్‌గా మారి.. యాంకర్‌గా పేరు తెచ్చుకుని.. తద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో నటిస్తూ.. పాపులర్ అయిన అనసూయ.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ అయ్యింది. బుల్లితెరపై హాట్‌గా హీట్ పుట్టించిన అనసూయ ఇప్పుడు వెండితెరపై వేడి పుట్టించేందుకు సిద్ధం అవుతుంది.



సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జునతో ఆడిపాడి, తర్వాత క్షణంతో విమర్శకుల ప్రశంసలు పొంది.. రంగమ్మత్తగా రంగస్థలంలో మెప్పించిన అనసూయ.. తెలుగు మహిళ, అలనాటి అందాల తార.. సిల్క్‌ స్మితగా స్క్రీన్‌పై సందడి చెయ్యబోతుంది. ఓ విజయ గాధలో నటించబోతుంది. శృంగార తారల వెండితెర జీవితం వెనుక విషాద గమనాలు, గమకములు ఎన్నో ఎన్నెనో! ఆ తెర వెనుక జీవితాలను తెర మీదకు తెచ్చి కాసుల పంట పండించుకునేందుకు నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు.



ముఖ్యంగా బాలీవుడ్‌‌లో ఎక్కువగా బయోపిక్‌లు తెరకెక్కిస్తూ ఉండగా.. ఇటీవలికాలంలో దక్షిణాదిలో కూడా బయోపిక్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫస్ట్ సిల్క్ స్మిత స్టోరీని వెండితెరపై ‘దర్టీ పిక్చర్’ పేరుతో బాలీవుడ్‌లో రూపొందించగా.. ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. 2011లో హిందీలో వచ్చిన ‘దర్టీ పిక్చర్‌’ సినిమాలో విద్యాబాలన్‌ నటించగా.. ఆమెకు ప్రశంసలు దక్కాయి.



ఇప్పుడు సిల్క్ స్మిత పాత్రలో అనసూయ చేస్తుండగా.. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత.. అనేక సినిమాలలో ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు చేయడంతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” అంటూ ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికీ సంచలనమే. విమర్శకుల ప్రశంసలు అందుకుని “soft porn” actressగా పేరు తెచ్చుకున్న ఆమె అసలు పేరు విజయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో పుట్టిన ఆమె కథలో సినిమాటిక్ విశేషాలు చాలా ఉన్నాయి. అందుకే మరో విజయగాధ రాబోతుందా? అని నెటిజన్లు అంటున్నారు.



ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా కనిపించింది. అయితే “సీతాకోక చిలుక” (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రల్లో మెప్పించింది. “లయనం” అనే “పెద్దల సినిమా” ఆమెకు చాలా పేరును తెచ్చింది. “రేష్మా కీ జవానీ” అనే పేరుతో దీనిని హిందీలో తీశారు. “వసంత కోకిల” చిత్రంలో ఆమె పాత్ర ప్రత్యేకమైనది.



ప్రస్తుతం అనసూయ నటిస్తున్న సిల్క్‌‌స్మిత బయోపిక్.. తమిళంలో తెరకెక్కుతుండగా.. అనసూయ సిల్క్‌స్మితలా ఫోజిచ్చిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సినిమాతోనే అనసూయ తమిళ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఈ మధ్యే చెన్నై వెళ్లిన అనసూయ.. అక్కడ స్టార్ హీరో విజయ్‌ సేతుపతిని కలిసి.. ఆయన సినిమాలో నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే సిల్క్‌స్మిత బయోపిక్‌లోనే వీరిద్దరు కలిసి నటిస్తున్నారా? వేరే ఏదైనా సినిమానా? అనేది అఫిషియల్‌గా రాలేదు.


‘సరికొత్త ఆరంభం.. కోలీవుడ్‌, తమిళనాడు’ అంటూ సిల్క్‌స్మితలా కనిపించే లుక్‌తో మరో పోస్ట్‌ చేసింది అనసూయ. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో అనసూయ నటిస్తోంది. అంతేకాదు.. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

లేటెస్ట్‌గా షూటింగ్‌కు సంబంధించిన పిక్‌ని కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. అది సిల్క్‌స్మిత బయోపిక్‌కు సంబంధించిన షూటింగ్‌లా అనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు