Telugu Actresses : పర్ఫార్మెన్స్ లతో అదరగొడుతున్న తెలుగు హీరోయిన్స్.. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా..

ఇటీవల పలు సినిమాలో తమ పర్ఫరామెన్స్ లతో మెప్పించి అదరగొట్టిన తెలుగు హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. (Telugu Actresses)

  • Updated on- July 28, 2026 / 09:42 PM IST

Telugu Actresses

Telugu Actresses : తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ ఉండటం అంటే చాలా గొప్ప విషయం. కొన్నాళ్ల క్రితం వరకు హీరోయిన్స్ అంటే కన్నడ, ముంబై నుంచే వచ్చేవాళ్ళు. అక్కడి వాళ్ళే ఇక్కడ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అయి, ఇక్కడ ఫేమ్, డబ్బులు సంపాదించుకొని మళ్ళీ బాలీవుడ్ కి చెక్కేస్తారు. తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకోరు అని అప్పుడపుడు పలువురు కామెంట్స్ చేస్తుంటారు.

కానీ గత కొంతకాలంగా, ముఖ్యంగా కరోనా తర్వాత తెలుగమ్మాయిల హవా పెరిగింది. ఒక్క సినిమాతోనే తామేంటో చూపించి, తమ పర్ఫార్మెన్స్ తో మెప్పించి స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు తెలుగు హీరోయిన్స్. ఆలస్యం అయినా పర్లేదు కానీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు వెతుక్కొని మరీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయిలు. ఇటీవల పలు సినిమాలో తమ పర్ఫరామెన్స్ లతో మెప్పించి అదరగొట్టిన తెలుగు హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్.. ఫొటోలు వైరల్..

ఇటీవలే అయిదు రోజుల క్రితం కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మంచి విజయం సాధించింది. మన తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో చేసి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా చేస్తుంది. తమిళ్ లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఇది కిరణ్ అబ్బవరం సినిమా కాదు శ్రీ గౌరీప్రియ సినిమా అని చెప్పుకుంటున్నారు. అంతలా తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఏడిపించేస్తుంది గౌరీప్రియ. సెకండ్ హాఫ్ లో స్మశానంలో ఉండే ఓ సీన్ అయితే వేరే లెవల్. దాని కోసం అయినా ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. అంతలా నటించింది శ్రీ గౌరీప్రియ.

కొన్ని నెలల క్రితం మన తెలుగమ్మాయి మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లి అనే సినిమాతో మెప్పించింది. ఈ సినిమాలో ఆరోగ్య సమస్యలతో చనిపోయే పాత్రలో నటించి ప్రేక్షకులను ఏడిపించింది. ఈ సినిమాలో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మేకప్ లేకుండా నటించి అందర్నీ మెప్పించింది మానస.

బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఎంత సెన్సేషనల్ అయిందో అందరికి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి హీరోయిన్ గా ఒక్కసారిగా బేబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ షాక్ కి గురిచేసింది. సినిమా తర్వాత ఆమె పాత్రను అందరూ తిట్టుకున్నారు. అంతలా వైష్ణవి చైతన్య ఆ పాత్రలో లీనమయి నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది.

Also Read : Reba Monica John : తల్లి అయిన హీరోయిన్.. కూతురు పుట్టిందంటూ..

ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో రాజు వెడ్స్ రాంబాయి అనే లవ్ స్టోరీ సినిమాలో తెలుగమ్మాయి తేజస్వి అదరగొట్టేసింది. విలేజ్ అమ్మాయిగా, చివర్లో ఎయిడ్స్ వచ్చే పాత్రలో తన నటనతో అందర్నీ మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. తేజస్వి కూడా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన తెలుగమ్మాయి.

తెలుగు హీరోయిన్స్ లో ప్రస్తుతం ట్రెండ్ లో ఉండి వరుస ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్ శివాని నగరం. సింగర్ అవుదామని వచ్చి అనుకోకుండా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించి హిట్ కొట్టింది. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి కుర్రాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఇటీవల హే బలవంత్ సినిమాతో ఇంకో విజయం అందుకుంది. ఇలా వరుసగా హిట్స్ కొడుతూ క్యూట్ హీరోయిన్ గా మెప్పిస్తూ దూసుకెళ్తుంది శివాని.

హీరోయిన్ అనన్య నాగళ్ళకు భారీ విజయాలు లేకపోయినా పర్ఫార్మెన్స్ లతో ఇప్పటికే చాలా సినిమాల్లో అదరగొట్టింది. పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, తంత్ర, మల్లేశం.. లాంటి పలు సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. అనన్య నాగళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది. ఒక్క పెద్ద హిట్ పడితే అనన్య కూడా ఊహించని స్టార్ డమ్ తెచ్చుకోవడం ఖాయం.

అచ్చ హైద్రాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టి వరుస సినిమాలు, గెస్ట్ పాత్రలు చేసుకుంటూ వెళ్తుంది. ఓ పక్క నటిగా మరో పక్క సింగర్, మ్యూజిక్ కంపోజర్, డ్యాన్సర్ గా కూడా ఫరియా ఫేమ్ తెచ్చుకుంటుంది. త్వరలో రాబోయే భగవంతుడు సినిమాలో తన నటనతో అందరూ ఆశ్చర్యపోతారు అని చెప్తుంది. ఈ భామ కూడా భగవంతుడు సినిమాతో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వెళ్లేలా ఉంది.

మరో తెలుగు భామ ఈషారెబ్బ ఎప్పట్నుంచో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. ఫేమ్, సినిమాలు ఉన్నా స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది.

ఇటీవలే తెలంగాణ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తమిళ్ లో ఓ సినిమాలో నటించి నటనతో పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగులో ఇడుపు కాయితం అనే సినిమాతో హీరోయిన్ గా రాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే నాగదుర్గకు కూడా మరిన్ని సినిమా అవకాశాలు రావడం ఖాయం.

అసలు వీళ్లందరికంటే సీనియర్ చాందిని చౌదరి. వైజాగ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. మంచి నటి అయినా కానీ తనకు తగ్గ పర్ఫార్మెన్స్ చూపించే రోల్ ఇంకా పడలేదు. స్టార్ అవ్వాల్సిన భామ అప్పట్లో తెలుగు వాళ్ళను ఎంకరేజ్ చేయక ఇలా చిన్న నటిగా మిగిలిపోయింది కానీ వరుస సినిమాలు అయితే చేస్తుంది.

రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు కూడా వరుస సినిమాలతో హీరోయిన్స్ గా మెప్పిస్తున్నారు. కోర్ట్ సినిమాతో శ్రీదేవి అనే తెలుగమ్మాయి కూడా హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తమిళ్ లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇలా ఇటీవల తెలుగు భామలు బయటకు వచ్చి హీరోయిన్స్ గా తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. ఇంకా కొంతమంది తెలుగు భామలు పలు చిన్న సినిమాల్ హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిచయం అవుతున్నారు. తెలుగు వాళ్లకు తక్కువ రెమ్యునరేషన్స్ ఇవ్వొచ్చు, ఎక్కడో ముంబై నుంచి ఫ్లైట్స్ లో రప్పించి హోటల్ రూమ్స్ వేసి భారీ ఖర్చు పెట్టక్కర్లేదు, భాష సమస్య కూడా ఉండదు అని ఇటీవల పలువురు దర్శక నిర్మాతలు తెలుగు హీరోయిన్స్ నే పెట్టుకోడానికి మొగ్గు చూపిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో తెలుగమ్మాయిలా హవా మొదలైంది.