Bigg Boss 7 Day 94 : ఏంటి బిగ్‌బాస్ ఇది.. ఫినాలే ముందు ఇంత సోసోగానా..
మరో పది రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. ఇలాంటి టైములో బిగ్‌బాస్ ఎపిసోడ్స్ ఎంత హోరాహోరీగా, ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. కానీ బుధవారం ఎపిసోడ్..
- gum 95921
- Published On : December 7, 2023 / 10:41 AM IST
Telugu Bigg Boss 7 Day 94 Highlights Vote for me tasks
Bigg Boss 7 Day 94 : బిగ్‌బాస్ 14వ వారం కూడా పూర్తి కావొస్తుంది. మరో పది రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. ఇలాంటి టైములో బిగ్‌బాస్ ఎపిసోడ్స్ ఎంత హోరాహోరీగా, ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. కానీ బుధవారం జరిగిన ఎపిసోడ్ ఆడియన్స్ కి నిద్ర తెప్పిచింది. ‘ఓటు ఫర్ అపిల్’ అంటూ ప్రేక్షకులను ఓటు అడిగే అవకాశం ఇచ్చేందుకు ప్రస్తుతం పలు టాస్క్ లు పెడుతున్నాడు బిగ్‌బాస్. ఈక్రమంలోనే మంగళవారం ఎపిసోడ్ లో శోభా విజేతగా నిలిచి.. ఓటు ఫర్ అపిల్ అవకాశాన్ని ఉపయోగించుకుంది.
ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా కొన్ని గేమ్స్ పెట్టాడు. మొదట రెండు కేజీలు కేక్ తినే టాస్క్, పిల్లల్ని ఆడించే టాస్క్, చెర్రీ పండు టాస్క్, గంట టాస్క్.. ఇలా అసలు ఆసక్తి కలిగించని గేమ్స్ ని పెట్టి బోర్ కొట్టించారు. ఆటలే సోసోగా ఉన్నాయంటే, వాటిని కంటెస్టెంట్స్ ఆడిన తీరు ఇంకా నిద్ర తెప్పించాయి. ఈ ఎపిసోడ్ చూసిన తరువాత.. అసలు నెక్స్ట్ వీక్ ఫినాలే ఉందా లేదా అనే సందేహం వచ్చింది. కాగా ‘ఓటు ఫర్ అపిల్’ రేస్ లో ఫైనల్ గా అమర్, అర్జున్ నిలిచారు. వీరిలో ఎవరు ఆ అవకాశం దక్కించుకున్నారు అనేది నేడు గురువారం ఎపిసోడ్ లో తెలియనుంది.
Also read : Hi Nanna Review : హాయ్ నాన్న మూవీ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ మాత్రమే కాదు.. ప్రేమ సన్నివేశాలతో కూడా..
కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంక, శివాజీ, అర్జున్ ఉన్నారు. వీరిలో అర్జున్ మొదటి ఫైనలిస్ట్ గా ఫినాలేకి ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో ఈ వీక్ నామినేషన్స్ లో అర్జున్ తప్ప అందరూ ఉన్నారు. ఇక టైటిల్ విజేత రేసులో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ ఉన్నట్లు చెబుతున్నారు. వీరి ముగ్గురు ఓట్లు పరంగా టాప్ లో ఉన్నారని సమాచారం. ఈ పది రోజుల్లో ఈ ముగ్గురిలో ఎవరి టాప్ కి వస్తారో చూడాలి.
