Pindam : అమెజాన్, అహలో అదిరిపోయే వ్యూస్ సంపాదిస్తున్న ‘పిండం’ మూవీ..

అమెజాన్, అహలో అదిరిపోయే వ్యూస్ సంపాదిస్తున్న 'పిండం' మూవీ. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు..

Telugu Horror movie Pindam getting super views in Aha and amazon prime video

Pindam : హారర్ సినిమాలకు ఎప్పుడు మంచి ఆధారణే ఉంటుంది. ఇక ఈ చిర్తలకు భాషతో కూడా సంబంధం ఉండదు. యూనివర్సల్ లాంగ్వేజ్ అయిన భయం.. అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా హారర్ నేపథ్యంతోనే ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘పిండం’. సాయి కిరణ్ దైదా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ప్రధాన పత్రాలు పోషించారు.

డిసెంబర్ లో థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా.. మోస్ట్ స్కేరియెస్ట్ చిత్రంగా ఆడియన్స్ నుంచి ప్రశంశలు పొందింది. ఇక థియేటర్ లో బాగా భయపెట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటిటిలో కూడా భయపెడుతూ ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రెండు ఓటీటీలో ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం.. సూపర్ వ్యూస్ ని అందుకుంటుంది. అహలో తెలుగు తమిళ్ భాషల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతొంది.

Also read : Gaanja Shankar : సాయి ధరమ్ తేజ్ సినిమాకి.. తెలంగాణ పోలీసులు నోటీసులు..

హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా ఈ సినిమాను తెరకెకించారు. ఒకవేళ థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఉంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూడొచ్చు. కాగా ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి నిర్మించగా.. హారర్ సీన్స్ కి తగ్గట్టు కృష్ణ శౌరబ్ సూరంపల్లి అందించిన సంగీతం ఆడియన్స్ ని బాగా భయపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు